SBI WARNS THEIR CUSTOMERS THAT DO NOT TO CLICK ON KYC FRAUDS AND EMBEDDED LINKS IN SMS FULL DETAILS HERE PRV GH
KYC Fraud: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. కేవైసీ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు హెచ్చరిక
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ప్రతీకాత్మక చిత్రం)
భారత అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కస్టమర్లను హెచ్చరించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. SMS రూపంలో వచ్చే ఎంబెడెడ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని కస్టమర్లకు సూచించింది. టెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు SBI షార్ట్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని కోరింది.
భారత అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) బ్యాంకింగ్ మోసాలపైఅప్రమత్తంగా ఉండాలని కస్టమర్లను (customers) హెచ్చరించింది.ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. SMS రూపంలో వచ్చే ఎంబెడెడ్ లింక్‌లపై (Embedded links) క్లిక్ చేయవద్దని కస్టమర్లకు సూచించింది. టెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు SBI షార్ట్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని కోరింది. కేవైసీ ఫ్రాడ్ మెసేజ్ (KYC Fraud messages)లు తరచు వస్తున్న నేపథ్యంలో ఖాతాదారుల్లో (Account holders) అవగాహన పెంచేందుకు ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ (Tweet) చేసింది. సైబర్ మోసంగా పరిగణించే ఒక ఎస్ఎమ్ఎస్లను ఉదాహరించింది. యేహ్ రాంగ్ నంబర్ హై. కేవైసీ ఫ్రాడ్ (KYC Fraud).అంటూ ఎస్ఎంఎస్ వస్తే మీరు నిజం అనుకోని మోసపోవచ్చు. దాన్ని క్లిక్ చేస్తే మీ ఖాతాలో ఉన్న నగదు (Money) మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో అటువంటి ఎంబీడెడ్ లింక్‌లను క్లిక్ చేయవద్దని కోరింది. సరైన ఎస్బీఐ షార్ట్ కోడ్ కోసం వెతకాలని సూచించింది. స్టే అలర్ట్ అండ్ స్టే సేఫ్ విత్ ఎస్బీఐ అంటూ ట్వీట్ చేసింది.
ఇన్ఫోగ్రాఫిక్ కాల్‌కు బదులుగా కస్టమర్ల (Customers)కు ఎస్ఎంఎస్లు (SMS) క్రిప్టిక్ ఎంబెడెడ్ లింక్‌తో వస్తాయి. వీటిని గనక కస్టమర్లు ఒకసారి క్లిక్ చేస్తే అంతే సంగతులు. వెంటనే కస్టమర్ ఖాతాహ్యాకర్ల చేతులోకి వెళ్తుంది.దీంతో ఖాతా (Account) ఖాళీ చేస్తారు. అందుకే, ఆయా మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. సందేహాస్పదంగా ఉండే ఎస్ఎంఎస్లు ఇలా ఉంటాయని ఎస్బీఐ (SBI) ఉదాహరణగా చూపించింది.
‘‘ డియర్ కస్టమర్, మీ ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ గడువు ముగిసింది. 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ చేయబడుతుంది. వెంటనే ఇక్కడ క్లిక్ చేసి మీ KYCని అప్లోడ్ చేయండి.’’ అంటూ మోసపూరిత మెసేజ్ (Fraud messages)లు వస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఇటువంటి మెసేజ్ మీఫోన్ నంబర్‌కు వస్తే మరో కేవైసీ ఫ్రాడ్ (KYC Fraud) మీ ముంగిట ఉన్నట్లేనని తెలిపింది. అందుకే, ఎంబీడెడ్ లింక్‌లను (Embedded links) క్లిక్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాము ఎప్పుడు కోరబోమని ఎస్బీఐ (SBI) స్పష్టం చేసింది. గత నెల 26న ఓటీపీ షేరింగ్ పట్ల అప్రమత్తంగా, అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది.యే రాంగ్ నంబర్ హై. సేఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియెన్స్. స్టే అలర్ట్ అండ్ సేఫ్టీ విత్ ఎస్బీఐ అని పేర్కొంది.
యూపీఐ మోసాలపై అప్రమత్తం
మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ (UPI) ఖాతాకు డబ్బులు డెబిట్ చేయమని ఎస్ఎంఎస్ వస్తే అప్రమత్తంగా ఉండాలని (Stay Alert)ఎస్బీఐ హెచ్చరించింది. యూపీఐ మోసాలపై ప్రతి ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలని సూచించింది. ప్రతి రోజు మన మొబైల్‌కు లెక్కలేనన్ని ఎస్ఎంఎస్ (SMS)లు వస్తుంటాయి. వ్యక్తిగత లోన్ కావాలా? అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. క్రిడిట్ కార్డ్ కావాలా? ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ బ్లూ లింక్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంటాయి. అలాంటి లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని ఎస్బీఐ (SBI) హెచ్చరించింది.
నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు
ఖతాదారులకు వచ్చే నకిలీ కస్టమర్ కేర్ (Fake Customer Care Numbers) నెంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచిస్తోంది. సరైన కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరుతోంది. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన విషయాలను ఎట్టిపరిస్థితుల్లో ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరిస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.