Home /News /business /

SBI WARNS CUSTOMERS ABOUT CYBER CRIMES IN THE NAME OF LIFE SAVING MEDICINE NS

ఖాతాదారులను అలర్ట్ చేసిన SBI.. అలాంటి మోసాలు జరిగే ఛాన్స్ ఉందంటూ హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడపై కీలక హెచ్చరిక చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. వివిధ సైబర్ మోసాలను గుర్తించి వాటిని ఖాతాదారులకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది ఈ బ్యాంకు. తాజాగా ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి ఓ పోస్టు చేసింది. కరోనా తో పోటు మోసగాళ్ల నుంచి కూడా కాపాడుకోవాలని ఆ పోస్టు సారాంశం. ప్రజలను ఆకర్షించడానికి కొందరు మోసగాళ్లు లైఫ్ సేవింగ్, ఇతర మందుల పేరిట ప్రకటనలు ఇస్తున్నారని ఎస్బీఐ తెలిపింది. తమ ఖాతాల్లోకి నగదు ట్రాన్స్ఫర్ చేయమని తద్వారా మందులు పంపిస్తామని ఆ మోసగాళ్లు సూచిస్తున్నట్లు వివరించింది. ఇలాంటి ప్రకటనలు ఫోన్ కు వస్తే పూర్తిగా తనిఖీ చేసుకున్న తర్వాతనే స్పందించాలని బ్యాంకు సూచించింది. బెనిఫిషియరీ వివరాల గురించి పూర్తిగా ఆరా తీయకుండా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారని హెచ్చరించింది బ్యాంకు.

    ఇదిలా ఉంటే.. కరోనా కేసులతో పాటు దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వివిధ వస్తువులపై ఆఫర్ల ఆశ చూపుతూ కేటుగాళ్లు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇటీవల అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తదితర యాప్ లను ఉచితంగా సబ్క్రైబ్ చేసుకోండంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ మెసేజ్ లోని లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఆఫర్లు వర్తిస్తాయన్నది ఆ మెసేజ్ సారాంశం.



    అయితే.. ఢిల్లీ పోలీసులు ఈ విషయమై ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి లింకులపై అస్సలు క్లిక్ చేయవద్దని సూచించారు. ఆ లింక్ లపై క్లిక్ చేస్తే మీకు తెలియకుండానే మీ ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు తదితర ముఖ్యమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని వారు హెచ్చరించారు. అలాంటి మెసేజ్ లు వస్తే క్లిక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. అలాంటి లింక్ లపై క్లిక్ చేస్తే మీ ఫోన్ లో సేవ్ అయిన అన్ని నంబర్లకు ఆ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుందని వివరించారు. ఇలాంటి మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Corona, CYBER CRIME, Sbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు