మీరు సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) మంచి ఐడియా. భారతీయుల నమ్మదగిన సంస్థగా ఉన్న పోస్ట్ ఆఫీస్ (Post Office) తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) నే గాక కొన్ని ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా ఖాతాదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మనం పెట్టే పెట్టుబడి నుంచి పన్ను లాభాలు పొందడమే గాక.. పెట్టుబడి మీద వడ్డీ కూడా ఇందులో లభిస్తుంది. రికరింగ్ డిపాజిట్ల (RD) ల మీద వచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposits- FD) తో సమానం. పైన పేర్కొన్న ఎస్బీఐ (SBI), పోస్ట్ ఆఫీసు (PO) లలో ఆర్డీ (RD) మీద తాజా వడ్డీ రేట్లు (Interest Rates) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఎస్బీఐ ఆర్డీ వడ్డీ రేట్లు.. సాధారణ ప్రజలకు 5 శాతం నుంచి 5.4 శాతం దాకా ఉన్నాయి. ఇది సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీరేట్ల పెంపు మారుతూ ఉంటుంది. ఈ రేట్లు 2021 జనవరి 21 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇక పోస్ట్ ఆఫీసులో ఆర్డీ చేస్తే దానికి వడ్డీ సంవత్సరానికి రూ. 5.8 శాతం అందిస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ వడ్డీ రేట్లు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉండగా.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలు మాత్రం ఐదేళ్ల కాలపరిమితి మాత్రమే కలిగి ఉన్నాయి. ఎస్బీఐ ఆర్డీని చెక్ లేదా నగదు రూపంలో అయినా.. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా తెరవచ్చు. కానీ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాను మాత్రం కచ్చితంగా సంబంధిత పీఓ ఆఫీస్ కు వెళ్లి మత్రమే తెరవొచ్చు.
ఇదీ చదవండి.. EPF: త్వరలో పీఎఫ్ వర్తింపులో కీలక మార్పు.. పూర్తి వివరాలివిగో..
తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
ఎస్బీఐ ఆర్డీ రేట్లు..
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 4.9 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కన్నా తక్కువ - 5.1 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 5.3 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు - 5.4 శాతం
2021 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఆర్డీపై వడ్డీ రేటు
సంవత్సరానికి - 5.8 శాతం గా నిశ్చయించింది. Published by:Srinivas Munigala
First published:January 24, 2021, 12:03 IST