ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్ డీ) ఉత్తమ పెట్టుబడి ఛాయిస్ అవుతుందా? అంటే ఆలోచించక తప్పదు. అయితే వృద్ధులకు, సురక్షితమైన, కచ్చితమైన రిటర్నులు పొందాలనేకునేవారికి ఎఫ్డీలు ఉత్తమమైనవే అని చెప్పవచ్చు. రెపో రేటును ఆర్బీఐ తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని టాప్ బ్యాంకులు ఎంపిక చేసిన మెచ్యురిటీలపై ఎఫ్డీలపై తక్కువ వడ్డీరేట్లు అందిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది వ్యక్తిగత ఖాతాదారులు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ల వైపు మళ్లుతున్నారు. వీటిలో త్రైమాసిక రివిజన్ రేట్లు ఉంటాయి. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల చివరి సారిగా వడ్డీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 1న రివిజన్ చేశారు. పోస్ట్ ఆఫీసు టర్మ్ డిపాజిట్ పథకాలు.. బ్యాంకుల్లో ఎఫ్డీల మాదిరే ఉంటాయి. బ్యాంక్ ఎఫ్డీల మాదిరే పోస్ట్ ఆఫీసుల్లో టర్మ్ డిపాజిట్లు ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలపరిమితిలో ఇవ్వెస్టర్లకు కచ్చితమైన రిటర్నులు ఉంటాయి. వడ్డీరేటు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీని రివైజ్ చేశారు. సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు 5.5 శాతం వడ్డీ, ఐదేళ్ల కాలానికి 6.7 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
Gold: ధంతేరాస్కు ముందు బంపరాఫర్... మార్కెట్ రేటుకన్నా తక్కువకే బంగారం
Prepaid Plans: రూ.300 లోపు Airtel, Jio, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
సంవత్సర కాలానికి- 5.5 శాతం
రెండేళ్ల కాలానికి- 5.5 శాతం
మూడేళ్ల కాలానికి- 5.5 శాతం
ఐదేళ్ల కాలానికి- 6.7 శాతం
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల కాలపరిమితి 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రకారం వడ్డీరేటు అందుబాటులో ఉంటుంది. సాధారణ వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్డీలపై 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు ఉంటుంది.
IRCTC Kerala Tour: హౌజ్ బోట్లో స్టేతో కేరళ టూర్... ప్యాకేజీ ధర తెలిస్తే షాకే
WhatsApp Payments: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపడం ఈజీ... ఈ స్టెప్స్ ఫాలో అవండి
7 రోజుల నుంచి 45 రోజుల వరకు- 4.5 శాతం
46 రోజుల నుంచి 179 రోజుల వరకు- 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజుల వరకు- 4.4 శాతం
211 రోజుల నుంచి ఏడాది వరకు- 4.4 శాతం
ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు- 4.9 శాతం
2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు- 5.1 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు- 5.3 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు- 5.4 శాతం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Investment Plans, Post office, Save Money, Sbi, State bank of india