Home /News /business /

SBI VS HDFC BANK VS ICICI BANK VS AXIS BANK LATE PAYMENT CHARGES OF CREDIT CARDS COMPARED GH VB

Credit cards: క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంపై మరింత వడ్డన.. బ్యాంకుల వారీగా ఆ చార్జీలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మన దేశంలో క్రెడిట్​ కార్డు(Credit Card) కొందరికి అవసరం, మరికొందరికి వ్యసనం. క్రెడిట్​ కార్డు ఉందంటే చాలు ఇష్టం వచ్చినట్లు షాపింగ్(Shopping)​ చేస్తుంటారు. ఆ తర్వాత బిల్లు చెల్లించలేక తిప్పలు పడుతుంటారు. గడువులోగా క్రెడిట్​ కార్డు బిల్లు చెల్లించకపోతే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ క్రెడిట్​ స్కోరు(Credit Score) కూడా తగ్గిపోతుంది.

ఇంకా చదవండి ...
మన దేశంలో క్రెడిట్​ కార్డు(Credit Card) కొందరికి అవసరం, మరికొందరికి వ్యసనం. క్రెడిట్​ కార్డు ఉందంటే చాలు ఇష్టం వచ్చినట్లు షాపింగ్(Shopping)​ చేస్తుంటారు. ఆ తర్వాత బిల్లు చెల్లించలేక తిప్పలు పడుతుంటారు. గడువులోగా క్రెడిట్​ కార్డు బిల్లు చెల్లించకపోతే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ క్రెడిట్​ స్కోరు(Credit Score) కూడా తగ్గిపోతుంది. తద్వారా భవిష్యత్తులో(Future) రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే క్రెడిట్​ కార్డు(Credit Card) ఉంది కదా అని అవసరం లేని వస్తువులు కొనడం, విచ్చలవిడిగా షాపింగ్​ చేయడం వంటివి మానేయాలని, లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కార్డు బిల్లును ఆలస్యంగా చెల్లిస్తే లేట్​ పేమెంట్ ఛార్జీలు(Payment Charges) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఛార్జీలు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇటీవల అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డులపై ఛార్జీలు పెంచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ), హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు అమలు చేస్తున్న లేట్​ పేమెంట్ ఛార్జీలను పరిశీలిద్దాం.

Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్ ఛార్జీలను పెంచనున్న ప్రముఖ బ్యాంక్.. ఫిబ్రవరి 10 నుంచి కొత్త ఛార్జీలు ఇవే..


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)
ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు యూజర్లు తమ పెండింగ్​ బిల్లులను ఆలస్యంగా చెల్లించే క్రమంలో లేట్​ పేమెంట్​ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రూ. 500లోపు అమౌంట్​పై ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ. 500 నుంచి రూ. 1000 వరకు గల పెండింగ్​ బిల్లుపై రూ. 400 లేట్​ పేమెంట్​ ఛార్జీ చెల్లించాలి. ఇక, రూ.1000 నుంచి రూ.10,000 పెండింగ్​ అమౌంట్​పై రూ. 750 లేట్ పేమెంట్​ ఛార్జీ చెల్లించాలి. రూ. 10001 నుంచి రూ. 25000 వరకు రూ. 950 చెల్లించాలి. రూ. 25001 నుంచి రూ. 50,000 వరకు రూ. 1100 చెల్లించాలి. రూ. 50 వేలకు మించిన పెండింగ్​ బిల్లులపై రూ. 1300 ఆలస్య రుసుము చెల్లించాలి. వీటికి అదనంగా టోటల్ పెండింగ్​ బిల్లుపై 2.5 శాతం ఓవల్​ లిమిట్​ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, ఆటో డెబిట్​/ చెక్​ రిటన్​ ఫీజు కింద 2 శాతం లేదా రూ. 450 చెల్లించాలి.

Credit Card Bill: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లింగ్ సైకిల్, మినిమం పేమెంట్ రూల్స్ తెలుసా?


ఐసీఐసీఐ బ్యాంక్​
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల రూ. 100లోపు పెండింగ్​ అమౌంట్​పై ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ. 100 నుంచి రూ. 500 వరకు గల పెండింగ్ బిల్లుపై రూ. 100 లేట్ పేమెంట్ ఛార్జీ చెల్లించాలి. ఇక, రూ.501 నుంచి రూ.5,000 పెండింగ్ బిల్లుపై రూ. 500 లేట్ పేమెంట్ ఛార్జీ చెల్లించాలి. రూ.5001 నుంచి రూ. 10000 వరకు రూ. 750 చెల్లించాలి. రూ. 25001 నుంచి రూ. 50000 వరకు రూ. 1000 చెల్లించాలి. రూ. 50 వేలకు మించిన పెండింగ్ బిల్లులపై రూ. 1200 ఆలస్యపు రుసుము చెల్లించాలి. వీటికి అదనంగా టోటల్ పెండింగ్ బిల్లుపై 2.5 శాతం ఓవల్ లిమిట్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

యాక్సిస్​ బ్యాంక్​
యాక్సిస్​ బ్యాంక్ రూ. 300లోపు పెండింగ్ బిల్లుపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ. 301 నుంచి రూ. 500 వరకు గల పెండింగ్ బిల్లుపై రూ. 100 లేట్ పేమెంట్ ఛార్జీ చెల్లించాలి. ఇక, రూ.501 నుంచి రూ.10000 పెండింగ్ బిల్లుపై రూ. 500 లేట్ పేమెంట్ ఛార్జీ చెల్లించాలి. రూ.10001 నుంచి రూ. 25000 వరకు రూ. 750 చెల్లించాలి. రూ. 25001 నుంచి రూ. 50000 అంతకంటే ఎక్కువ బిల్లుపై రూ. 1000 ఆలస్యపు రుసుము చెల్లించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Credit cards, Icici, Sbi

తదుపరి వార్తలు