news18-telugu
Updated: January 24, 2020, 5:44 PM IST
SBI: ఆన్లైన్లో పేమెంట్స్ చేయాలంటే ఈ ఫీచర్ వాడుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వర్చువల్ కార్డ్ ద్వారా ఇ-కామర్స్ లావాదేవీలు జరిపే అవకాశం కల్పిస్తోంది. ఎస్బీఐ వర్చువల్ కార్డ్‌ను ఆన్లైన్ షాపింగ్ కోసం ఉపయోగించొచ్చు. వర్చువల్ కార్డ్ మీరు తరచూ ఉపయోగించే ప్లాస్టిక్ కార్డ్ లాంటిదే. అయితే మీ ప్రైమరీ కార్డ్‌లో ఉండే వివరాలేవీ మీరు పేమెంట్ చేసే ఇకామర్స్ సంస్థకు వెల్లడించకుండా వర్చువల్ కార్డ్‌ను ఉపయోగించొచ్చు. మోసాలను తగ్గించేందుకు ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఎస్బీఐ వర్చువల్ కార్డ్ 48 గంటలు లేదా మీ ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యేవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ కార్డు ఉండదు. వర్చువల్ కార్డ్ ద్వారా రూ.100 నుంచి రూ.50,000 మధ్య పేమెంట్ చేయొచ్చు. అయితే వీసా కార్డుల్ని అంగీకరించే ఆన్లైన్ మర్చంట్ దగ్గరే ఎస్బీఐ వర్చువల్ కార్డ్ పనిచేస్తుంది. వర్చువల్ కార్డ్ సింగిల్ యూసేజ్ కార్డ్. అంటే ఈ కార్డును ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలరు.
SBI virtual card: ఎస్బీఐ వర్చువల్ కార్డ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి
ముందుగా మీరు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్ www.onlinesbi.com ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ చేయండి.
టాప్‌లో 'e-Card' ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత 'generate virtual card' ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
మీరు ఏ అకౌంట్ నుంచి వర్చువల్ కార్డ్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలో సెలెక్ట్ చేయండి.
మీ వర్చువల్ కార్డ్‌కు ఎన్ని డబ్బులు పంపాలో ఎంటర్ చేయండి.
నియమ నిబంధనలు అంగీకరించి 'Generate' పైన క్లిక్ చేయండి.మీరు కార్డ్ హోల్డర్ పేరు, డెబిట్ కార్డ్ అకౌంట్ నెంబర్, వర్చువల్ కార్డ్ లిమిట్ వెరిఫై చేయాల్సి ఉంటుంది.
ఎస్బీఐ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ పంపిస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత 'Confirm' పైన క్లిక్ చేయండి.
వేలిడేషన్ పూర్తైన తర్వాత వర్చువల్ కార్డ్ ఇమేజ్, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ లాంటి వివరాలు స్క్రీన్‌పైన కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
ICICI Bank: ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా
Pension Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్
Save Money: రూ.1 కోటి కావాలంటే ఇలా పొదుపు చేయండి
Published by:
Santhosh Kumar S
First published:
January 24, 2020, 5:44 PM IST