యెస్ బ్యాంకులో షేర్ల కొనుగోలు చేసేందుకు ఎస్బీఐకు ఈసీసీబి అనుమతి ఇచ్చింది. దీంతో యెస్ బ్యాంకులోని మొత్తం 725 కోట్ల షేర్లను రూ. 7,250 కోట్ల ఖరీదుతో కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరు రూ. 10 చొప్పున చెల్లించనుంది. యస్ బ్యాంక్లో మొత్తం 49 శాతం లోపే ఎస్బీఐ వాటా ఉండనుంది. సెబీ అనుమతులకు లోబడే యెస్ బ్యాంక్లో రూ. 7,250 కోట్లతో 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు (ఈసీసీబీ) ఆమోదముద్ర వేసినట్లు అని స్టాక్ ఎక్స్ చేంజీలకు ఎస్బీఐ తెలియజేసింది. ఇదిలా ఉంటే ఆర్బీఐ రూపొందించిన యెస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ముసాయిదా ప్రకారం వ్యూహాత్మక ఇన్వెస్టర్లు బ్యాంకులో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల లోపు దీన్ని 26 శాతానికి లోపు తగ్గించుకోవడానికి ఉండదు. మొండిబాకీలు, గవర్నెన్స్ లోపాలు, నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంకుపై ఏప్రిల్ 3 దాకా ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మొత్తం ఏడుగురు ఇన్వెస్టర్లు కలిసి ఎస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టనున్నారు. వీరిలో ఎస్బీఐ తో పాటు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, రాధాకిషన్ దమానీ, రాకేష్ జున్ జున్ వాలా, అజీమ్ ప్రేమ్ జీ ట్రస్టుతో కలిపి మొత్తం రూ. 12000 కోట్లు యెస్ బ్యాంక్ పునరుద్ధరణ కోసం సమీకరించనున్నారు.
Published by:Krishna Adithya
First published:March 13, 2020, 12:25 IST