SBI News | దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఎస్‌బీఐ (SBI) కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని ఉండదు. బ్యాంక్ (Bank) ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా వీడియో లైఫ్ సర్టిఫికెట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ సేవలు ఇప్పటి వరకే సాధారణ పెన్షనర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి.
అయితే ఇప్పుడు ఎస్‌బీఐ వీడియో లైఫ్ సర్టిఫికెట్ సేవలను ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా విస్తరించింది. ఇప్పుడు ఇంటి నుంచే ఈ పెన్షన్ పొందే వారు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. వీడియో కాల్ ద్వారా పని పూర్తి చేయొచ్చు. ఎస్‌బీఐ పెన్షన్ సేవ మొబైల్ యాప్ ద్వారా వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అందించొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించింది.
కనక వర్షం కురిపిస్తున్న రూ.2 షేరు.. ఏడాదిలోనే రూ.2 లక్షలకు రూ.10 లక్షలు!
అంతేకాకుండా ఫ్యామిలీ పెన్షన్ పొందే వారు ఉచితంగానే ఈ సేవలు పొందొచ్చు. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత వారి కుటుంబంలో ఉన్న వారికి పెన్షన్ లభిస్తుంది. వీరిని ఫ్యామిలీ పెన్షనర్లు అని పిలుస్తారు. భాగస్వామి, పిల్లలు ఎవరైనా కావొచ్చు. ఉద్యోగి మరణించిన తర్వాత వీరికి పెన్షన్ వస్తుంది.
వామ్మో.. జనవరి 1 నుంచి రూ.10 వేలు పెరగనున్న బైక్ ధర.. ఇప్పుడే కొనేసుకోండి!
Video Life Certificates with an ease. Now even family pensioners can avail the services via the SBI Pension Seva Mobile App or website. Visit https://t.co/Mor15EzEb7 to know more.#SBI #AmritMahotsav #PensionSeva #VideoLifeCertificate pic.twitter.com/guQRs2j9Of
— State Bank of India (@TheOfficialSBI) December 15, 2022
ఇకపోతే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసి పెన్షన్ పొందే వారు అందరూ కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఇది తప్పనిసరి. ఒకవేళ పెన్షన్ పొందే వారు లైఫ్ సర్టిఫికెట్ అందించకపోతే.. అప్పుడు పెన్షన్ ఆగిపోతుంది. మళ్లీ లైఫ్ సర్టిఫికెట్ అందించిన తర్వాతనే పెన్షన్ లభిస్తుంది. అందుకు లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి. బ్యాంక్‌కు వెళ్లి జీవర్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన పని లేకుండా ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లోనే ఈ సేవలు అందుబాటులో ఉంచింది. ప్రతి ఏటా నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Life certificate, Pensions, Sbi, State bank of india