SBI FD Rates | దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ - SBI ) అదిరిపోయే స్కీమ్ అందిస్తోంది. ప్రత్యేకమైన ఎఫ్‌డీ పథకాన్ని అందుబాటులో ఉంచింది. ఇందులో చేరితే అదిరే రాబడి పొందొచ్చు. ఇతర రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలతో పోలిస్తే.. ఈ స్కీమ్ ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. దీని టెన్యూర్ తక్కువగా ఉంటుంది. అయితే వడ్డీ రేటు మాత్రం ఎక్కువగా ఉంది.
ఎస్‌బీఐ అందిస్తున్న ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ పేరు ఎస్‌బీఐ సర్నోత్తం. ఇది నాన్ క్యాలబుల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్. దీని టెన్యూర్ రెండేళ్ల వరకు మాత్రమే ఉంటుంది. అంటే స్వల్ప కాలంలో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలని భావించే వారు రూ. 2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. కనీసం రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి.
క్రెడిట్ కార్డు బిల్లు ఈ యాప్‌తో కడితే అకౌంట్‌లోకి డబ్బులు.. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వోచర్లు!
ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. కస్టమర్లు ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ స్కీమ్‌లో ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా డబ్బులు దాచుకున్న వారికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇది రెగ్యులర్ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 7.6 శాతం వడ్డీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఏడాది టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ.. ఉగాది పండుగ ముందు కీలక నిర్ణయం, రేపటి నుంచి..
అదే మీరు రెండేళ్ల టెన్యూర్‌తో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తే.. అప్పుడు మీకు వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 7.9 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ వెల్లడించింది.
ఉదాహరణకు మీరు ఎస్‌బీఐ అందిస్తున్న ఈ సర్వోత్తం స్కీమ్‌లో చేరితే.. ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. టెన్యూర్ 2 ఏళ్లు. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 23.15 లక్షలు వస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలో రూ. 3 లక్షలకు పైగా వస్తాయని చెప్పుకోవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ. 3.3 లక్షల వరకు వడ్డీ రాబడి వస్తుంది. కాగా ఎస్‌బీఐ ఇటీవలనే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. వడ్డీ రేట్లు 0.25 శాతం మేర పైకి చేరాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, FD rates, Fixed deposits, Sbi, State bank of india