SBI SME GOLD LOAN NOW YOU CAN GET SME GOLD LOAN UPTO RUPEES 50 LAKH FROM SBI NEW SCHEME WITHOUT DOCUMENTS HERE IS THE FULL DETAILS NK
SBI SME Gold Loan: రూ.50 లక్షల గోల్డ్ లోన్ ఇస్తున్న SBI... ఇలా పొందండి
రూ.50 లక్షల గోల్డ్ లోన్ ఇస్తున్న SBI (ప్రతీకాత్మక చిత్రం)
SBI SME Gold Loan: రూ.50 లక్షల లోన్ అంటే మాటలు కాదు. దాన్ని ఎలా పొందాలి... ఏయే కండీషన్లు ఉంటాయి... ఎప్పటికల్లా చెల్లించాలి... వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SBI SME Gold Loan: ఒకప్పుడు అప్పు పొందడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు కాల్ చేసి మరీ లోన్లు ఇస్తామంటున్నాయి బ్యాంకులు. ఐతే... ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)... ఎలాంటి ఫైనాన్షియల్ డాక్యుమెంట్ల అవసరం లేకుండానే రూ.50 లక్షల దాకా లోన్ ఇస్తోంది. దాని పేరే ఎస్బీఐ SME గోల్డ్ లోన్ ఆఫర్. ఈ ఆఫర్ కింద ఎస్బీఐ కస్టమర్లు... రూ.1 లక్ష నుంచి రూ.50 లక్షల వరకూ చాలా తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. ఈ విషయాన్ని SBI... తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించింది. "ఎస్బీఐ SME గోల్డ్ లోన్ ద్వారా మీరు తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొంది... మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. ఈ ప్రక్రియ చాలా తేలికైనది, ఎంతో ఈజీ. మా బ్రాంచ్‌కి ఇవాళే వచ్చి లోన్ పొందండి" అని ట్వీట్లో తెలిపింది.
Grow your business with SBI's SME Gold Loan at very attractive rates. Apply now and avail the loan. Process is simple and hassle free.
Visit our branch today!
మరి చిన్న, మధ్య తరగతి పారిశ్రామిక వేత్తల కోసం క్రియేట్ చేసిన ఈ లోన్ ఫీచర్లు తెలుసుకుందాం.
1. Target Group & Eligibility:
ఎస్పీఐ పోస్ట్ ప్రకారం... ఇది ఆల్రెడీ చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను నడుపుతున్న వారికి వర్తిస్తుంది. లోన్ పొందాలనుకునేవారు తమ నగలను తాకట్టు పెట్టి పొందవచ్చు. ఐతే... వ్యాపారం జరుగుతూ ఉండాలి. NPA స్టేటస్ కలిగి ఉండకూడదు.
2. SBI SME Gold Loan Purpose:
ఈ లోన్‌ను వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్‌గా వాడుకోవచ్చు. యంత్రాలు కొనవచ్చు. ఈ డబ్బుతో రిపేర్లు చేయించవచ్చు. ఫర్నిచర్ కొనవచ్చు. ఏవైనా సరే పరిశ్రమకు సంబంధం ఉండాలి.
3. Loans will not be granted against Gold Bar/Bullion:
ఈ లోన్ పొందేందుకు ఎలాంటి ఫైనాన్షియల్ పత్రాలూ అవసరం లేదు. ఎంత టర్నోవర్ వస్తుందో చెప్పాల్సి ఉంటుంది. గోల్డ్ బార్లకు లోన్ ఇవ్వరు.
4. Nature of facility and quantum of loan:
ఈ లోన్‌ను ఓవర్ డ్రాఫ్ట్ (OD) లేదా డిమాండ్ లోన్ (DL)గా పరిగణిస్తుంది బ్యాంక్.
5. Repayment period:
ఈ లోన్‌ను గరిష్టంగా 12 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
6. Processing Fee:
రూ.10 లక్షల వరకూ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు రూ.500 (అదనంగా టాక్సులు) దాకా ఉంది. రూ.10 లక్షలకు మించి లోన్ పొందాలంటే రూ.1000 ప్రాసెసింగ్ ఫీజు (అదనంగా టాక్సులు) ఉంటాయి.