Home /News /business /

Mutual Fund SIP: ప్రతీ నెలా జీతంలో కొంత పొదుపు చేస్తే రూ.47 లక్షల రిటర్న్స్

Mutual Fund SIP: ప్రతీ నెలా జీతంలో కొంత పొదుపు చేస్తే రూ.47 లక్షల రిటర్న్స్

Mutual Fund SIP: ప్రతీ నెలా జీతంలో కొంత పొదుపు చేస్తే రూ.47 లక్షల రిటర్న్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund SIP: ప్రతీ నెలా జీతంలో కొంత పొదుపు చేస్తే రూ.47 లక్షల రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund SIP | ఏడాదిన్నరగా స్టాక్ మార్కెట్ (Stock Market) ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. షేర్లలో ఇన్వెస్ట్ చేసినవారికి మాత్రమే కాదు మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) ఇన్వెస్ట్ చేసినవారికీ మంచి రిటర్న్స్ వచ్చాయి.

    మీరు మ్యూచువల్ ఫండ్‌లో (Mutual Fund) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతీ నెలా కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుందా అని లెక్కలేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువకాలం సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేదాని బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. 10 ఏళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్స్‌లో నెలనెలా కొంత చొప్పున సిప్ చేసినవారు ఇప్పుడు లక్షాధికారులయ్యారు. గత 18 నెలల్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 TRI ఏకంగా 221 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

    స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో సిప్స్ చేస్తున్నవారికి మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్కలు చూస్తే తెలుస్తోంది. 2021 సెప్టెంబర్ 21 నాటికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో వివరిస్తూ మనీ కంట్రోల్ ఓ కథనం పబ్లిష్ చేసింది. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో గత పదేళ్లుగా ప్రతీ నెలా రూ.10,000 చొప్పున సిప్ చేసినవారికి ఇప్పుడు రిటర్న్స్ ఎంత వచ్చాయో లెక్కలు వివరించింది. మరి గత 10 ఏళ్లలో మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకోండి.

    Post Office Scheme: మీ జీతంలో కాస్త పొదుపు చేస్తే రూ.16,00,000 రిటర్న్స్... స్కీమ్ వివరాలివే

    Nippon India Small cap: నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి ఇప్పుడు రూ.47,00,000 జమ అయ్యాయి. అంటే 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.35,00,000 రిటర్న్స్ వచ్చాయి.

    SBI Small cap: ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి కూడా రూ.47,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో కూడా 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.35,00,000 రిటర్న్స్ వచ్చాయి.

    Kotal Small cap: కొటక్ స్మాల్‌ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.41,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.29,00,000 రిటర్న్స్ వచ్చాయి.

    Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్నారా? రూ.10 లక్షల వడ్డీ తగ్గించుకోండి ఇలా

    DSP Small cap: డీఎస్‌పీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.39,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.27,00,000 రిటర్న్స్ వచ్చాయి.

    Franklin India smaller Cos: ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్‌లో 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.35,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.23,00,000 రిటర్న్స్ వచ్చాయి.

    HDFC Small cap: హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో కూడా ఇలాగే భారీ రిటర్న్స్ వచ్చాయి. 10 ఏళ్లుగా ప్రతీ నెల రూ.10,000 చొప్పున జమ చేసినవారికి రూ.35,00,000 జమ అయ్యాయి. ఈ ఫండ్‌లో కూడా 10 ఏళ్లలో రూ.12,00,000 జమ చేస్తే రూ.23,00,000 రిటర్న్స్ వచ్చాయి.

    సిస్టమెటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ ద్వారా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిపై వచ్చే రిటర్న్స్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేముందు స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులను బట్టి రిటర్స్స్ ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mutual Funds, Personal Finance, Stock Market

    తదుపరి వార్తలు