SBI SERVICES WITH TOLL FREE NUMBERS WITHOUT GOING TO THE BANK KNOW HOW UMG GH
SBI: ఎస్‌బీఐ కస్టమర్లు ఇక బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంటి దగ్గర నుంచే అన్ని సేవలు.. ఇదిగో ఇలా..!
state bank of india
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెండు కొత్త టోల్ ఫ్రీ (toll free) నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లకు బ్యాంకింగ్( Banking) సేవలను సులువుగా అందించేందుకు ఈ నంబర్లను ప్రకటించింది. వీటి ద్వారా అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను కస్టమర్లకు అందించేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను సులువుగా అందించేందుకు ఈ నంబర్లను ప్రకటించింది. వీటి ద్వారా అంతరాయం లేని బ్యాంకింగ్ (Banking) సేవలను కస్టమర్ల(Costumers)కు అందించేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. పనులు వేగంగా పూర్తి చేసుకోవడానికి బ్రాంచ్‌లో ప్రదక్షిణలు చేయనవసరం లేకుండా, ఎస్‌బీఐ కస్టమర్‌లు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా అనేక సేవలను పొందే అవకాశం ఉంది.
* కొత్త SBI టోల్ ఫ్రీ నంబర్లు ఏవి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్లు: 1800 1234 లేదా 1800 2100. బ్యాంక్ ప్రకారం, ఈ రెండు నంబర్లకు డయల్ చేయడం ద్వారా, ఎస్‌బీఐ కస్టమర్‌లు తమ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్‌బీఐ చేసిన ఓ ట్వీట్‌లో.. మీ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోండి, కేవలం కాల్ చేయండి! SBI కాంటాక్ట్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్లు 1800 1234 లేదా 1800 2100ల సేవలు పొందండి.’ అని తెలిపింది.
ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్లు కార్డ్ బ్లాక్ చేయడం, కార్డ్‌లను రిక్వెస్ట్ చేయడం వంటి అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. సేవలు 24×7 అందుబాటులో ఉంటాయి, అంటే కస్టమర్లు ఆదివారం, సెలవు దినాల్లో కూడా శాఖకు వెళ్లకుండానే SBI బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. SBI టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా పొందగలిగే సేవలు ఇవే..
- SBI టోల్ ఫ్రీ నంబర్లు 1800 1234, 1800 2100కి డయల్ చేయడం ద్వారా, SBI కస్టమర్‌లు తమ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. వారి చివరి ఐదు ట్రాన్సాక్షన్‌ల వివరాలు పొందవచ్చు.
- వినియోగదారులు తమ ATM కార్డ్ బ్లాకింగ్ స్టేటస్‌ను, అలాగే కార్డ్ డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు.
- SBI టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా, కస్టమర్‌లు తమ చెక్‌బుక్‌ల డిస్పాచ్ స్టేటస్‌ని చెక్ చేయవచ్చు. ఏదైనా కారణాల వల్ల మునుపటిది బ్లాక్ అయినట్లయితే కొత్త ATM కార్డ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.
- కస్టమర్లు ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించి ఇ-మెయిల్ ద్వారా వారి టీడీఎస్ వివరాలను, డిపాజిట్ వడ్డీ ధ్రువీకరణ పత్రాన్ని కూడా పొందవచ్చు.
* SBI టోల్ ఫ్రీ నంబర్ సేవలను ఎవరు పొందవచ్చు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి నంబర్లను డయల్ చేయవచ్చు. దయచేసి SBI 24X7 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి , 1800 1234 (టోల్-ఫ్రీ), 1800 11 2211 (టోల్-ఫ్రీ), 1800 425 3800 (టోల్-ఫ్రీ), 1800 2100 (టోల్-ఫ్రీ-208909) నంబర్లకు దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి ఫోన్ చేసి సేవలు పొందవచ్చు అని ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఖాతా బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్‌ల వివరాలను 24 గంటల్లో ఫోన్‌లో తెలుసుకునే సదుపాయం ఉంది. డిపాజిట్లు, లోన్ స్కీమ్‌లు, సేవల సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
SBI కస్టమర్‌లు ఈ నంబర్లను ఏ ప్రదేశం నుంచి అయినా డయల్ చేసి సేవలను పొందే అవకాశం ఉంది. దీని వలన సేవలను పొందడానికి బ్రాంచ్‌కి వెళ్లే సమయం ఆదా అవుతుంది. ఇబ్బందులు ఉండవు. అలాగే వెబ్‌సైట్ లేదా యాప్ సేవలను వినియోగించలేని వారికి టోల్‌ఫ్రీ నంబర్లు ఉపయోగపడతాయి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.