State Bank Of India | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI - ఎస్‌బీఐ) అదిరిపోయే స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరితే అదిరే రాబడి పొందొచ్చు. డబ్బు (Money) రెట్టింపు చేసుకోవచ్చు. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఎస్‌బీఐ అందిస్తున్న ఈ పథకంలో చేరొచ్చు. రిస్క్ లేకుండా రాబడి సొంతం చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ ఇటీవలనే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేసింది. దీని వల్ల కస్టమర్లు గతంలో కన్నా ఇప్పుడు త్వరితగతిన డబ్బులను రెట్టింపు చేసుకోవచ్చు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంపు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ గత ఏడాది మే నెల నుంచి చూస్తే.. ఇప్పటి వరకే రెపో రేటును ఏకంగా 2.5 శాతం మేర పెంచేసింది. దీంతో బ్యాంకులు కూడా వరుస పెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఎస్‌బీఐ కూడా డిపాజిట్ రేట్లు పెంచింది.
పోస్టాఫీస్ బ్లాక్‌బస్టర్ స్కీమ్.. చేరితే ప్రతి నెలా రూ.9,000 పొందొచ్చు
ఫిబ్రవరి 15 నుంచి చూస్తే.. ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ స్కీమ్‌పై 7.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. ఇది ఆకర్షణీయ వడ్డీ అని చెప్పుకోవచ్చు. ఈ వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. డబ్బులు ఎప్పటి కల్లా రెట్టింపు అవుతాయో ఇప్పుడు తెలుసుకుందా. మీరు రూ. 50 వేలు డిపాజిట్ చేస్తే.. పదేళ్లలో మీకు రూ. లక్షకు పైగా వస్తాయి. అదే రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 2.1 లక్షల వరకు పొందొచ్చు.
కేంద్రం అదిరే ఆఫర్.. ఇలా చేస్తే మీ అకౌంట్‌లోకి ఉచితంగా రూ.6 వేలు!
రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ తర్వాత రూ. 10 లక్షలకు పైగా వస్తాయి. అయితే మీరు పదేళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఒక్కసారి డబ్బులు పెడితే టెన్యూర్ పూర్తి అయ్యేంత వరకు అలానే ఉండాలి. డబ్బులు విత్‌డ్రా చేసుకోకూడదు. ఒకవేళ టెన్యూర్ కన్నా ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే.. అప్పుడు చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. వడ్డీ రాబడి తగ్గుతుంది. అందుకే బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని భావించే వారు ఈ విషయాన్నిగుర్తించుకోవాలి. అలాగే పేరున్న బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోవడం ఉత్తమం. ఎందుకంటే బ్యాంక దివాలా తీస్తే.. డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద గరిష్టంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, FD rates, Fixed deposits, Personal Finance, Sbi, State bank of india