స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. కోట్లాది కస్టమర్లకు సేవలు అందిస్తోంది ఎస్బీఐ. ఇటీవల
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై ఉన్న మినిమమ్ బ్యాలెన్స్‌ను ఎత్తేసింది. ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా రద్దు చేసింది. కస్టమర్ల కోసం అనేక అకౌంట్లను అందిస్తోంది ఎస్బీఐ. అందులో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్-SCSS అకౌంట్ కూడా ఒకటి. ఎస్బీఐలోని తొమ్మిది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇది కూడా ఒకటి. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకౌంట్ అది. ఇది ప్రభుత్వం అందిస్తున్న పథకం కాబట్టి ఖాతాదారులు ధీమాగా ఉండొచ్చు. ఈ స్కీమ్‌లో ఇచ్చే వడ్డీని ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జనవరి-మార్చి త్రైమాసికానికి ప్రభుత్వం 8.6% వడ్డీ అందిస్తోంది. అంటే ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నవారికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
SBI SCSS account: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌కు అర్హతలివే...
ఎవరైనా వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిపి జాయింట్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
ఎన్ఆర్ఐలు, హిందూ అవిభాజ్య కుటుంబం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీల్లేదు.
60 ఏళ్లు దాటినవాళ్లు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
55 ఏళ్లు దాటి 60 ఏళ్ల లోపు ఉన్నవారు సూపర్యాన్యుషన్తో రిటైరైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
డిఫెన్స్ సర్వీసెస్‌ను రిటైరైనవాళ్లు 50 ఏళ్లు దాటితే ఈ అకౌంట్ తెరవొచ్చు.
SBI SCSS account: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వివరాలివే...
ఈ స్కీమ్ 5 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిన ఏడాదిలో బ్యాంకుకు దరఖాస్తు చేసుకొని మరో మూడేళ్లు పొడిగించొచ్చు. లేకపోతే మెచ్యూర్ అయిన తర్వాత ఏ సమయంలో అయినా అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఇందులో కనీసం రూ.1,000 నుంచి రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రతీ మూడు నెలలకు వడ్డీ వస్తుంది. ఒకవేళ వడ్డీ తీసుకోకపోతే వడ్డీపై మళ్లీ వడ్డీ రాదు. జాయింట్ అకౌంట్లో డబ్బులు జమ చేసినా ఫస్ట్ అకౌంట్ హోల్డర్ పేరు మీదే డబ్బులు డిపాజిట్ అవుతాయి. భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినీగా ఒకరి పేరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పేర్లు ఇవ్వొచ్చు.
ఇవి కూడా చదవండి:
SBI Salary Account: ఎస్బీఐలో సాలరీ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే...
Aadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు
Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్Published by:Santhosh Kumar S
First published:March 17, 2020, 15:30 IST