SBI New Account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్లకు ఎక్కువ లాభం

SBI New Account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్లకు ఎక్కువ లాభం (ప్రతీకాత్మక చిత్రం)

SBI Saving Plus Account | మీరు ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కువ లాభాలు ఉన్న ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ గురించి తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా-SBI ఖస్టమర్లకు శుభవార్త. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ పేరుతో ఓ కొత్త సర్వీస్ అందిస్తోంది. సాధారణ అకౌంట్‌తో పోలిస్తే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు ఎక్కువ. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో ఖాతాదారులు దాచుకునే డబ్బులకు 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌ హోల్డర్లు సేవింగ్స్ బ్యాలెన్స్‌పై ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఈ అకౌంట్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు లింక్ అయి ఉంటుంది. మీ అకౌంట్‌లో మీకు ఇప్పట్లో అవసరం లేని డబ్బులు ఉంటే ఆ మొత్తానికి ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఆ డబ్బులు ఆటోమెటిక్‌గా టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌లో ఉన్నన్ని రోజులు సాధారణ వడ్డీ కంటే ఎక్కువ పొందొచ్చు.

    IRCTC Contest: రైలులో ప్రయాణిస్తూ రూ.1,00,000 గెలుచుకోండి... ఐఆర్‌సీటీసీ కాంటెస్ట్ వివరాలివే

    IRCTC Special Tourist Train: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి వారణాసికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్

    ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌లో రూ.35,000 కన్నా ఎక్కువగా ఉన్న డబ్బులు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్తాయి. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి కనీసం రూ.10,000 జమచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ అకౌంట్‌లో రూ.45,000 ఉంటే రూ.10,000, రూ.50,000 ఉంటే రూ.15,000 మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అవుతాయి. ఈ మొత్తానికి అధిక వడ్డీ పొందొచ్చు. ఈ అకౌంట్ తీసుకున్నవారికి సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సేవలన్నీ ఉంటాయి. ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది.

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌ను తక్కువ అంచనా వేయొద్దు... కోటీశ్వరులు కావొచ్చు ఇలా

    New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

    మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌ అకౌంట్‌కు లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు. ఈ అకౌంట్‌కు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉండదు. ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. వ్యక్తిగతంగా, జాయింట్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: