• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • SBI SALARY ACCOUNT ZERO BALANCE TO FREE SMS ALERTS KNOW ABOUT BENEFITS OF STATE BANK OF INDIA SALARY ACCOUNT SS

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే లాభాలు ఇవే

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే లాభాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Salary Account | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏఏ లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    మీరు ఉద్యోగులా? బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సాలరీ అకౌంట్ తీసుకోండి. ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా సాలరీ అకౌంట్ రూపొందించింది. సాధారణ అకౌంట్లతో పోలిస్తే సాలరీ అకౌంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఎక్కువే. కేవలం ఉద్యోగులకు మాత్రమే సాలరీ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టైతే, మీకు ప్రతీ నెలా వేతనం బ్యాంకు అకౌంట్‌లోకి వస్తున్నట్టైతే ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ ఆఫీసులో ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. మరి ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేసే ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకోండి.

    Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే

    Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

    SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్‌తో వచ్చే లాభాలు ఇవే


    ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మీరు ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్‌లో డబ్బులు ఎన్ని ఉంటే మొత్తం డ్రా చేయొచ్చు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు మీరు ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

    ఎస్‌బీఐ సాలరీ అకౌంట్‌తో యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది. కస్టమర్ ప్రొఫైల్‌ను బట్టి రూ.20 లక్షల వరకు యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది. దీంతో పాటు ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ కవర్ కూడా లభిస్తుంది. ఈ కవరేజీ రూ.30 లక్షల వరకు ఉంటుంది.

    Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి

    Akshaya Tritiya: ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి

    ఇక ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ హోల్డర్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ లాంటి రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక సాలరీ అకౌంట్ హోల్డర్లకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

    ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ హోల్డర్ బ్యాంకులో లాకర్ తీసుకుంటే లాకర్ ఛార్జీలపై 25 శాతం తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు ఉచితంగా డీడీ, మల్టీ సిటీ చెక్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, నెఫ్ట్, ఆర్‌టీడీఎస్ సేవలు, దేశంలోని అన్ని ఏటీఎంలల్లో ఉచితంగా అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published: