SBI RULES STATE BANK OF INDIA CHANGED DEPOSIT AND ATM WITHDRAWAL RULES KNOW NEW RULES SS
SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్బీఐ రూల్స్ ఇవే
SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్బీఐ రూల్స్ ఇవే
SBI Rules | మీ అకౌంట్లో మీరు తప్ప మరొకరు డిపాజిట్ చేయలేరు. మీరు ఇతరుల అకౌంట్లో డిపాజిట్ చేయలేరు. అంతేకాదు... మీ కన్నతండ్రి కూడా మీ అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ఎస్బీఐ అనుమతించదు.
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తరచూ లావాదేవీలు చేస్తుంటారా? మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయడంతో పాటు విత్‌డ్రా చేస్తుంటారా? కొద్ది రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రా రూల్స్ మార్చింది. ఎస్బీఐ ఖాతాదారులకు ఇప్పటికీ క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రా రూల్స్ విషయంలో గందరగోళం ఉంది. మరి మారిన రూల్స్ ఏంటీ? తెలుసుకోండి.
ఎస్బీఐ ఏటీఎం విత్‌డ్రాయల్ రూల్స్
ఎస్బీఐ ఏటీఎం విత్‌డ్రాయల్ నిబంధనల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. 2018 అక్టోబర్ 31 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. గతంలో మీరు ఏటీఎంలో ఒక రోజులో రూ.40,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశముండేది. ఆ పరిమితిని రూ.20,000 చేసింది ఎస్బీఐ. అంటే మీరు ఒక రోజులో కేవలం రూ.20,000 మాత్రమే ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు ఏటీఎం మోసాలను తగ్గించేందుకు ఎస్బీఐ ఈ నిబంధనల్ని అమలు చేస్తోంది. అయితే ప్లాటినం కార్డు ఉన్నవాళ్లు మాత్రం రోజుకు రూ.1 లక్ష వరకు ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవచ్చు.
క్యాష్ డిపాజిట్ రూల్స్ కూడా మార్చింది ఎస్బీఐ. నోట్ల రద్దు సమయంలో క్యాష్ డిపాజిట్ల రూపంలో చాలా మోసాలు జరిగాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎవరి అకౌంట్లో వాళ్లే డిపాజిట్ చేయాలన్న నిబంధనను అమలు చేస్తుంది ఎస్బీఐ. అంటే... మీ అకౌంట్లో మీరు తప్ప మరొకరు డిపాజిట్ చేయలేరు. మీరు ఇతరుల అకౌంట్లో డిపాజిట్ చేయలేరు. అంతేకాదు... మీ కన్నతండ్రి కూడా మీ అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ఎస్బీఐ అనుమతించదు. మీ అకౌంట్లో మీరు ఏ బ్రాంచ్‌లో అయినా డబ్బులు జమ చేయొచ్చు. గతంలో ఉన్న రూ.25,000 డిపాజిట్ లిమిట్‌ను ఎత్తేసింది. ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు.
అన్లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్
మీరు మీ అకౌంట్లో మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1 లక్ష కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే ఏటీఎంలల్లో ఉచితంగా ఎన్ని లావాదేవీలైనా జరపొచ్చు. రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు 8 ఉచిత ట్రాన్సాక్షన్స్ లభిస్తాయి. అందులో 5 ఎస్బీఐ, 3 ఇతర బ్యాంకుల ట్రాన్సాక్షన్స్. నాన్ మెట్రోలో అయితే 10 ఉచిత ట్రాన్సాక్షన్స్ లభిస్తాయి. అందులో 5 ఎస్బీఐ, 5 ఇతర బ్యాంకుల ట్రాన్సాక్షన్స్. ఇకపై మీరు ఎస్బీఐలో లావాదేవీలు చేయాలనుకుంటే ఈ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకోండి.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.