హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI: నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రూ.1,60,000 రిటర్న్స్... ఎస్‌బీఐలో పొందండి ఇలా

SBI: నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రూ.1,60,000 రిటర్న్స్... ఎస్‌బీఐలో పొందండి ఇలా

ఆ వృద్ధుడు దీనిపై బ్యాంకుకు సమాచారం అందించారు. అయితే బ్యాంకు వారు డబ్బు ఖర్చు చేయమని వృద్ధులకు చెప్పారు. ఆ తరువాత తన తప్పును గ్రహించిన బ్యాంక్ అధికారులు.. ఇప్పుడు వృద్ధులకు ఖర్చు చేసిన డబ్బుతో మిగిలిన డబ్బును చెల్లించాలని ఆదేశించారు.

ఆ వృద్ధుడు దీనిపై బ్యాంకుకు సమాచారం అందించారు. అయితే బ్యాంకు వారు డబ్బు ఖర్చు చేయమని వృద్ధులకు చెప్పారు. ఆ తరువాత తన తప్పును గ్రహించిన బ్యాంక్ అధికారులు.. ఇప్పుడు వృద్ధులకు ఖర్చు చేసిన డబ్బుతో మిగిలిన డబ్బును చెల్లించాలని ఆదేశించారు.

SBI RD Account | పొదుపు పథకాల్లో (Saving Schemes) చేరాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్‌డీ అకౌంట్ ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

  ప్రతీ నెలా మీ జీతంలో కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా? భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే సేవింగ్స్ ప్రారంభించాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ మంచి అవకాశం ఇస్తోంది. ఎస్‌బీఐలో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (SBI RD Account) ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు. కేవలం నెలకు రూ.100 నుంచి సేవింగ్స్ మొదలుపెట్టొచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. జీతం రాగానే సాలరీ నుంచి కొంత పొదుపు చేయాలనుకునేవారికి ఉపయోగపడే అకౌంట్ ఇది. ఈ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేస్తే ప్రతీ నెలా కస్టమర్ చెప్పిన తేదీన డబ్బులు ఆర్‌డీ అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ అకౌంట్‌లో నెలకు రూ.1,000 పొదుపు చేసి రూ.1,60,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  Business Loan: బిజినెస్ లోన్ కావాలా? వాట్సప్‌లో మెసేజ్ చేస్తే రూ.10 లక్షల వరకు రుణాలు

  ఎస్‌బీఐ ఆర్‌డీ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ ద్వారా కనీసం 12 నెలలు డబ్బులు డిపాజిట్ చేయాలి. గరిష్టంగా 120 నెలలు అంటే 10 ఏళ్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అయినా ఈ అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ.100 నుంచి పొదుపు చేయొచ్చు. ప్రతీ నెలా తప్పనిసరిగా డబ్బులు డిపాజిట్ చేయాలి. లేకపోతే పెనాల్టీ ఛార్జీలు ఉంటాయి. 5 ఏళ్ల లోపు అకౌంట్‌కు నెలకు రూ.100 కి రూ.1.50 పెనాల్టీ, 10 ఏళ్ల లోపు అకౌంట్‌కు నెలకు రూ.100 కి రూ.2.00 పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ వరుసగా ఆరు నెలలు ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. డబ్బులు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌లో జమ అవుతాయి.

  Loans for IPOs: లోన్ తీసుకొని ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ రిస్కు గుర్తుంచుకోండి

  ఎస్‌బీఐ ఆర్‌డీ అకౌంట్‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది. యూనివర్సల్ పాస్‌బుక్ లభిస్తుంది. లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఈ అకౌంట్‍ను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. వడ్డీ రేట్ల విషయానికి వస్తే టర్మ్ డిపాజిట్స్‌కు ఉన్న వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ప్రస్తుతం 5 ఏళ్లలోపు డిపాజిట్లకు 5.30 శాతం, 5 నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లకు 5.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.

  Business Idea: నష్టాలు ఉండని ఎవర్‌గ్రీన్ బిజినెస్ ఐడియా... మీరూ స్టార్ట్ చేయండి ఇలా

  ఇక రిటర్న్స్ విషయానికి వస్తే ఎస్‌బీఐ ఆర్‌డీ అకౌంట్‌లో నెలకు రూ.1,000 చొప్పున 10 ఏళ్లు అంటే 120 నెలలు జమ చేస్తే పొదుపు చేసిన మొత్తం రూ.1,20,000 అవుతుంది. ఈ మొత్తానికి ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. మొత్తం కలిపి 10 ఏళ్ల తర్వాత రూ.1,60,000 రిటర్న్స్ వస్తాయి. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం వడ్డీ అదనంగా వస్తుంది కాబట్టి రిటర్న్స్ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Investment Plans, Personal Finance, Sbi, State bank of india

  ఉత్తమ కథలు