SBI Quick Transfer: ఎస్‌బీఐ క్విక్ ట్రాన్స్‌ఫర్... ఎవరికైనా డబ్బులు పంపడం క్షణాల్లో సాధ్యం

SBI Quick Transfer Feature | ఎవరికైనా డబ్బులు పంపాలంటే మీరు ఖచ్చితంగా బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎస్‌బీఐలో డబ్బులు పంపే పద్ధతే క్విక్ ట్రాన్స్‌ఫర్.

news18-telugu
Updated: April 21, 2019, 6:29 PM IST
SBI Quick Transfer: ఎస్‌బీఐ క్విక్ ట్రాన్స్‌ఫర్... ఎవరికైనా డబ్బులు పంపడం క్షణాల్లో సాధ్యం
SBI Quick Transfer: ఎస్‌బీఐ క్విక్ ట్రాన్స్‌ఫర్... ఎవరికైనా డబ్బులు పంపడం క్షణాల్లో సాధ్యం (image: SBI)
  • Share this:
మీరు వెంటనే ఎవరికైనా మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌నుంచి రూ.10,000 పంపాలనుకుంటున్నారా? బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్టర్ చేయడం ఇష్టం లేదా? బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్టర్ చేయకుండా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది చాలా సులువు. సాధారణంగా ఎస్‌బీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే బెన్ఫీషియరీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మీరు రూ.10,000 వరకు క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సాధారణంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి రెండు పద్ధతులుంటాయి. ఒకటి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(RTGS). రెండోది నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్(NEFT). ఈ రెండు వ్యవస్థల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఆర్‌టీజీఎస్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే వెంటనే అవతలి అకౌంట్‌లోకి వెళ్తాయి. అదే నెఫ్ట్ అయితే సెటిల్మెంట్ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఆర్‌టీజీఎస్‌లో రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. నెఫ్ట్‌లో ఎలాంటి మినిమమ్ లిమిట్ లేదు. గరిష్టంగా రూ.10 లక్షలు పంపొచ్చు. ఈ రెండు పద్ధతుల్లో డబ్బులు పంపాలంటే మీరు ఖచ్చితంగా బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. బెన్ఫీషియరీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎస్‌బీఐలో డబ్బులు పంపే పద్ధతే క్విక్ ట్రాన్స్‌ఫర్.

Read this: SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...

ఎస్‌బీఐ క్విక్ ట్రాన్స్‌ఫర్ ఎలా పనిచేస్తుంది?


ఎస్‌బీఐ క్విక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మీరు బెన్‌ఫీషియరీ అకౌంట్ రిజిస్టర్ చేయకుండా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అయితే భారీ మొత్తంలో డబ్బులు పంపడానికి కుదరదు. కేవలం రూ.10,000 వరకు మాత్రమే పంపొచ్చు. ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్లకు మాత్రమే కాదు... ఇతర బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారికీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. క్విక్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ద్వారా ఐఎంపీఎస్ మోడ్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మీరు ఈ సదుపాయం వాడుకోవాలంటే ఆన్‌లైన్ ఎస్‌బీఐ అకౌంట్‌లో లాగిన్ కావాలి. 'Payment/Transfers' ట్యాబ్ పైన క్లిక్ చేసి క్విక్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అయితే క్విక్ ట్రాన్స్‌ఫర్ ఉపయోగించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం మంచిది.

Read this: IDBI Account: అకౌంట్ ఓపెన్ చేయాలా? బ్యాంకుకు వెళ్లకుండానే సాధ్యం

ఎస్‌బీఐ క్విక్ ట్రాన్స్‌ఫర్: తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...


బెన్‌ఫీషియరీ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి.బెన్‌ఫీషియరీ వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే బ్యాంకు బాధ్యత వహించదు.
బెన్‌ఫీషియరీ అకౌంట్ నెంబర్ రెండుసార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే మనీ ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అవుతుంది.
ఎస్‌బీఐ యాప్‌లో కూడా క్విక్ ట్రాన్స్‌ఫర్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
ఒక ట్రాన్సాక్షన్‌లో గరిష్టంగా రూ.10,000 మాత్రమే పంపొచ్చు.
రోజుకు రూ.25,000 మాత్రమే అనుమతి ఇస్తుంది బ్యాంకు.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
Published by: Santhosh Kumar S
First published: April 21, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading