SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే

SBI phone banking | మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

news18-telugu
Updated: March 28, 2019, 11:35 AM IST
SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే
SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే
news18-telugu
Updated: March 28, 2019, 11:35 AM IST
బ్యాంకు సేవలు పొందేందుకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరున్న చోట నుంచే బ్యాంకు సేవల్ని పొందొచ్చు. ఇందుకోసం మీకు కావాల్సింది ఓ ఫోన్. అందులో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫోన్ బ్యాంకింగ్‌లో అనేక సేవలు లభిస్తాయి. బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ-స్టేట్‌మెంట్, లోన్ ఆఫర్స్ ఇలా ఎలాంటి సేవలైనా సులువుగా పొందొచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు పొందుతూ ఉండొచ్చు. కానీ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సేవలు ఇంకా సులువుగా లభిస్తాయి. ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించేందుకు మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది ఎస్‌బీఐ. మరి ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఏ సేవల్ని ఎలా పొందాలో తెలుసుకోండి.

Read this: IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చు

E-Statement, ATM Card Blocking, sbi phone banking, sbi phone banking balance enquiry, how to use sbi phone banking, sbi phone banking password change, sbi phone banking password reset, sbi phone banking login page, sbi phone banking forgot password, sbi phone banking login forgot password, sbi missed call banking, sbi miss call balance number 2019, sbi account balance, sbi mini statement check by miss call, sbi account balance check by missed call number, sbi my account balance enquiry, sbi balance checking mobile number, sbi quick app, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిస్డ్ కాల్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ ఫోన్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్



స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్


1. ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ లేదా పాస్‌వర్డ్ జెనరేషన్: ఇందుకోసం కస్టమర్లు కాల్ సెంటర్‌కు కాల్ చేయాలి. 1800112211, 18004253800, 08026599990 నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఇవి టోల్‌ ప్రీ నెంబర్లు. ఐవీఆర్‌లో ఆప్షన్స్ సరిగ్గా విని మీ ఏటీఎం కార్డు నెంబర్, పిన్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది.



2. ఏటీఎం ద్వారా ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్ జెనరేషన్: మీ ఏటీఎం కార్డును స్వైప్ చేయాలి. స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది.

3. బ్రాంచ్‌లో ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్: మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి. బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది.4. SBI Quick రిజిస్ట్రేషన్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ‘REGAccount Number’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి. ఉదాహరణకు REG 12345678901 అని పంపాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ నెంబర్ వస్తుంది. SBI Quick నుంచి డీ రిజిస్టర్ చేయాలంటే ‘DREG ’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.

Read this: TRAI Good news: సెటాప్ బాక్స్ మార్చకుండా మరో ఆపరేటర్‌కు మారొచ్చు

E-Statement, ATM Card Blocking, sbi phone banking, sbi phone banking balance enquiry, how to use sbi phone banking, sbi phone banking password change, sbi phone banking password reset, sbi phone banking login page, sbi phone banking forgot password, sbi phone banking login forgot password, sbi missed call banking, sbi miss call balance number 2019, sbi account balance, sbi mini statement check by miss call, sbi account balance check by missed call number, sbi my account balance enquiry, sbi balance checking mobile number, sbi quick app, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిస్డ్ కాల్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ ఫోన్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్ సేవలివే...


Generate ATM PIN: మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు. PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP రెండురోజులే పనిచేస్తుంది.

SBI Balance Enquiry: మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

SBI Mini Statement: చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

SBI E-Statement: మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు. ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.

SBI Cheque Book Request: మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి.

Read this: National Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్... ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 14 శాతం

E-Statement, ATM Card Blocking, sbi phone banking, sbi phone banking balance enquiry, how to use sbi phone banking, sbi phone banking password change, sbi phone banking password reset, sbi phone banking login page, sbi phone banking forgot password, sbi phone banking login forgot password, sbi missed call banking, sbi miss call balance number 2019, sbi account balance, sbi mini statement check by miss call, sbi account balance check by missed call number, sbi my account balance enquiry, sbi balance checking mobile number, sbi quick app, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిస్డ్ కాల్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ ఫోన్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్

ATM Card Blocking: మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే BLOCK0000 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ కార్డు బ్లాక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.

ATM Card On/Off: మీ ఏటీఎం కార్డును మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ యూసేజ్... ఏదైనా బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM అని టైప్ చేసి మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు కలిపి 09223966666 నెంబర్‌కు కాల్ చేయాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM 0000 అని టైప్ చేయాలి.

SBI Loans: ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రుణాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మీరు ‘HOME’ లేదా ‘CAR’ అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Facebook Login Alert: మీ ఫేస్‌బుక్‌లో ఇతరులు లాగిన్ అయితే అలర్ట్ మెసేజ్... సెట్టింగ్స్ ఇవే

Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు
First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు