SBI Gold Loan: ఎస్‌బీఐలో రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్... వడ్డీ రేట్లు ఇవే

SBI Personal Gold Loan | కనీసం రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

news18-telugu
Updated: April 17, 2019, 3:43 PM IST
SBI Gold Loan: ఎస్‌బీఐలో రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్... వడ్డీ రేట్లు ఇవే
SBI Gold Loan: ఎస్‌బీఐలో రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్... వడ్డీ రేట్లు ఇవే
news18-telugu
Updated: April 17, 2019, 3:43 PM IST
అప్పు ఎవరికైనా అవసరమే. బంగారం తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకునేవాళ్లు ఉంటారు. బంగారంపై తీసుకునే రుణాలకు వడ్డీ రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారంపై రుణాలను ఆఫర్ చేస్తోంది. ఆభరణాలతో పాటు గోల్డ్ కాయిన్స్‌పై రుణాలు తీసుకోవచ్చు. పేపర్ వర్క్ తక్కువ. వడ్డీ రేట్లు కూడా తక్కువే. కనీసం రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. మరి ఎస్‌బీఐ పర్సనల్ గోల్డ్ లోన్ తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు, వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.

SBI Personal Gold Loan: ఎస్‌బీఐ పర్సనల్ గోల్డ్ లోన్ వివరాలివే...


18 ఏళ్ల వయస్సు దాటినవాళ్లెవరైనా ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

నెలనెలా ఆదాయం వచ్చే ఉద్యోగులు, పెన్షనర్స్‌కు అవకాశం.
గరిష్ట పరిమితి: రూ.20 లక్షలు.
కనీసం: రూ.20 వేలు.


కాల వ్యవధి: 36 నెలలు.
Loading...
ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంపై 0.50%+ జీఎస్టీ లేదా కనీసం రూ.500+జీఎస్టీ.
వడ్డీ రేటు: ఒక ఏడాది ఎంసీఎల్ఆర్‌ కన్నా 1.25 శాతం ఎక్కువ.
కావాల్సిన డాక్యుమెంట్లు: రెండు ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, రుణగ్రస్తులు నిరక్షరాస్యులైతే సాక్షి సంతకంతో కూడిన లేఖ.

Photos: అమితాబ్ బచ్చన్ కొన్న కొత్త వాహనం ఇదే... ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:

TikTok Ban: టిక్ టాక్ ఫ్యాన్స్‌కు షాక్... ప్లేస్టోర్‌లో మాయమైన యాప్

SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు

FLIPKART TV Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఐపీఎల్ సేల్... టీవీలపై ఆఫర్లు
First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...