హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Passbook: ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్... ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్... ఎందుకంటే

SBI Passbook: ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్... ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్... ఎందుకంటే

SBI Passbook: ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్... ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్... ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Passbook: ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్... ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Passbook | డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్ (FIFA World Cup 2022 Final) జరగబోతోంది. ఇప్పుడు ఎస్‌బీఐ పాస్‌బుక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఫిఫా వాల్డ్ కప్ 2022 ఫైనల్ (FIFA World Cup 2022 Final) డిసెంబర్ 18న జరగనుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫుట్‌బాల్ వాల్డ్ కప్ ఫైనల్ (Football World Cup Final) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అన్న చర్చ ప్రపంచంలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అందరిలో జరుగుతోంది. ఖతార్ నేషనల్ డే రోజున లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ (Argentina vs France) మధ్య జరిగే మ్యాచ్‌పైనే ప్రపంచ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ దృష్టి ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎస్‌బీఐ పాస్‌బుక్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.

ఎస్‌బీఐ పాస్‌బుక్‌కు, ఫిఫా వాల్డ్ కప్ 2022 ఫైనల్‌కు సంబంధం ఏంటా అనుకుంటున్నరా? ఎస్‌బీఐ పాస్‌బుక్ కవర్ లైట్ బ్లూ, వైట్ చారలతో ఉంటుంది. రెండు నీలం ప్యానెల్‌ల మధ్య, తెల్లటి ప్యానెల్ ఉంటుంది. దానిపై బ్లాక్ కలర్‌లో బ్యాంకు పేరు, బ్లూ కలర్‌లో ఎస్‌బీఐ లోగో ఉంటుంది. యాదృచ్ఛికంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్స్ జెర్సీ కూడా ఇలాగే ఉంటుంది. దీంతో ఇప్పుడు ఎస్‌బీఐ పాస్‌బుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

SBI: త్వరపడండి... ఎస్‌బీఐ నుంచి 2023 జనవరి 31 వరకే ఈ ఆఫర్

ఇప్పుడు రెండింటి మధ్య ఉన్న పోలికపై సోషల్ మీడియాలో పలు పోస్టులు కనిపిస్తున్నాయి. ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ సందర్భంగా భారతదేశంలో ఎక్కువగా అర్జెంటీనా ఫ్యాన్స్ ఎందుకు ఉన్నారో ఇది రుజువు చేస్తుందని కామెంట్ చేస్తున్నారు. మూడోసారి ట్రోఫీని గెలుచుకునే అవకాశం కోసం అర్జెంటీనా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అర్జెంటీనా ఫ్యాన్స్ ఎస్‌బీఐ పాస్‌బుక్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Araku One Day Tour: ఒక్క రోజులో అరకు చుట్టేసి వచ్చేయండి... ప్యాకేజీ వివరాలివే

అర్జెంటీనాకు ఎస్‌బీఐ అఫీషియల్ పార్ట్‌నర్ అని, ఎస్‌బీఐ లంచ్ టైమ్ ఎంతో, అర్జెంటీనా మొత్తం మ్యాచ్ సమయం అంత అని కామెంట్స్ చేస్తున్నారు. మరి డిసెంబర్ 18 ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

First published:

Tags: FIFA World Cup 2022, Football, Sbi, State bank of india

ఉత్తమ కథలు