Paytmతో SBI భాగస్వామ్యం.. కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు లాంచ్.. అదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI).. డిజిటల్ చెల్లింపులు ప్లాట్ ఫామ్ అయిన పైటీఎం(Paytm)తో భాగస్వామిగా అవతరించింది. ఈ రెండు సంస్థలు కలిసి కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చాయి.

news18-telugu
Updated: November 6, 2020, 6:58 PM IST
Paytmతో SBI భాగస్వామ్యం.. కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు లాంచ్.. అదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డిజిటల్ చెల్లింపులు ప్లాట్ ఫామ్ అయిన పైటీఎంతో భాగస్వామిగా అవతరించింది. ఈ రెండు సంస్థలు కలిసి కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చాయి. రెండు క్రెడిట్ కార్డు మోడళ్లను ప్రారంభించాయి. పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డు, పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డు సెలక్ట్ అనే రెండు మోడళ్లతో అందుబాటులోకి వచ్చాయి. ఇవి వీసా ప్లాట్ ఫామ్ తో పాటు స్మార్ట్ యాప్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది. అంతే కాకుండా వినియోగదారులకు ఉన్నతమైన బహుమతులు, ప్రయోజనాలు కూడా అందిస్తాయి.

చెల్లింపులపై క్యాష్ బ్యాక్ ఆఫర్..

కొత్తగా ప్రారంభించిన పేటీఎం ఎస్బీఐ కార్డు, పేటీఎం ఎస్బీఐ కార్డు సెలక్ట్ ను ఉపయోగించి వినియోగదారులు మూవీ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు 5 శాతం క్యాష్ బ్యాక్ లేదా పేటీఎం మాల్ ద్వారా కొనుగోళ్లు నిర్వహించేటప్పుడు 2 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. యుటిలిటీ ఛార్జీలు, మొబైల్ రిచార్జ్ వంటి అదనపు చెల్లింపులు, ఇతర ఆన్ లైన్ ఖర్చులపై ఒకశాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశముంది. ట్రావెల్ టిక్కెట్లపై కూడా వినియోగదారులకు ఆఫర్లు లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు పేటీఎం యాప్ నుంచి కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. ఇవి దీపావళి వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. నవంబరు 1 నుంచి పేటీఎం యాప్ లో లైవ్ ఉంచింది.

వార్షిక రుసుము చెల్లించాలి..
ఈ రెండు కార్డులు కొనుగోలు చేసేందుకు వార్షిక రుసుము చెల్లించాలి. రూ.499, రూ.1499ల వార్షిక రుసుము చెల్లించి కొనుగోలు చేసుకోవాలి. మొదటిసారి పేటీఎం మెంబర్ షిప్ ను వినియోగించేవారికి మొదటి లావాదేవీపై రూ.750ల క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. పేటీఎం మొదటి సభ్యత్వ, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలక్ట్ క్రెడిట్ కార్డు రెండింటిపై మొదటి లావాదేవీల్లో రూ.750ల క్యాష్ బ్యాక్ ఉంటుంది.

వన్ టచ్ సేవలు..
అంతే కాకుండా ఈ పేటీఎం ఎస్బీఐ కార్డులను బ్లాక్ లేదా అన్ బ్లాక్ చేసుకోవాలంటే వన్ టచ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే డబ్బు నష్టపోయినపుడు, కార్డును బ్లాక్ చేయడం, డూప్లికేట్ కార్డు జారీచేయడం, అత్యుత్తమ క్రెడిట్ పరిమితిని వీక్షించే అవకాశం ఇందులో ఉంది. కార్డు అవసరం లేనప్పుడు వినియోగదారులు కాంటాక్ట్ లెస్ చెల్లింపులు లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం కార్డును స్విచ్ ఆఫ్ చేయవచ్చు. అదనంగా నూతన క్రెడిట్ కార్డు సేవ వ్యక్తీకరించిన వ్యయ విశ్లేషణతో వస్తుంది. ఖర్చులను అంచనా వేయడానికి, భవిష్యత్తు ఖర్చులను ప్లాన్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

గిఫ్ట్ వోచర్లు, బీమా కవరేజీ..
పేటీఎం ఎస్బీఐ కార్డు సెలక్ట్ కస్టమర్లకు మొదటి రెండు కార్డు సభ్యత్వ సంవత్సరాలకు కాంప్లిమెంటరీ ప్రియారిటీ పాస్ సభ్యత్వం లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు కాంప్లిమెంటరీ దేశీయ విమానాశ్రాయ లాంచ్ సందర్శనలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలతో పాటు కార్డులు వినియోగదారులకు లాయల్టీ పాయింట్లను కూడా రివార్డు చేస్తాయి. పేటీఎం ఎస్బీఐ కార్డు సెలక్ట్ కస్టమర్లకు రూ.6000 వరకు గిఫ్ట్ వోచర్లను కూడా పొందవచ్చు. అయితే పేటీఎం ఎస్బీఐ కార్డు కస్టమర్లు.. మొదటి పేటీఎం మెంబర్ షిఫ్ వోచర్ తో వార్షికంగా లక్ష రూపాయల వరకు ఖర్చు చేసుకోవచ్చు. కార్డు హోల్డర్లకు ఒక్క శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపుతో పాటు సైబర్ మోసం, బీమా కవరేజీ వరుసగా లక్ష నుంచి రూ. 2 లక్షలు పేటీఎం ఎస్బీఐ కార్డు, పేటీఎం ఎస్బీఐ కార్డు సెలక్ట్ వినియోగదారులకు లభిస్తుంది.
Published by: Nikhil Kumar S
First published: November 6, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading