SBI: ఎస్‌బీఐ ఆన్ లైన్ సేవలకు విఘాతం...పనిచేయని యోనో యాప్...

SBI: ఆన్ లైన్ లావాదేవీలు జూలై 22 ఉదయం నుంచి పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే స్మార్ట్‌ ఫోన్‌లో సేవలు ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ యాప్ యోనో కూడా పనిచేయటంలేదని కస్టమర్లు వాపోతున్నారు.

news18-telugu
Updated: July 22, 2019, 4:57 PM IST
SBI: ఎస్‌బీఐ ఆన్ లైన్ సేవలకు విఘాతం...పనిచేయని యోనో యాప్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ లావాదేవీలు జూలై 22 ఉదయం నుంచి పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే స్మార్ట్‌ ఫోన్‌లో సేవలు ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ యాప్ యోనో కూడా పనిచేయటంలేదని కస్టమర్లు వాపోతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ అధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఈ అంతరాయాలకు సంబంధించి బ్యాంకు వర్గాలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులు అత్యధికంగా డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అంతే కాదు వినియోగదారులు కూడా తమకు సౌలభ్యంగా ఉందని ఎక్కువగా ఆన్‌లైన్‌ ద్వారానే బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోవడం ఇబ్బందికరంగా మారింది. కస్టమర్ల ఫిర్యాదుల కొరకు ట్విట్టర్ ను ఆశ్రయించడంతో ఎస్‌బీఐ ట్విట్టర్‌ అకౌంట్ కంప్లైంట్ లతో నిండిపోయింది.
First published: July 22, 2019, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading