Home /News /business /

SBI OFFERS LESS INTEREST RATES ON HOME LOANS FOR WOMEN ON THE OCCASION OF WOMENS DAY HERE FULL DETAILS NS

Women's day 2021: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు SBI బంపరాఫర్.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహిళా దినోత్సవ వేళ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మహిళా లోకానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    సొంతింటి కళను నిజం చేసుకోవాలనుకోవడం ప్రతీ ఒక్కరి కల. ముఖ్యంగా సొంత ఇంటిని కలిగి ఉండాలన్న కోరిక పురుషుల కంటే మహిళలకు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవ వేళ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మహిళా లోకానికి గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు తెలిపింది. వారికి 6.70 ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ ఆఫర్ అందించనున్నట్లు తెలిపింది ఎస్బీఐ. ఈ అవకాశాన్ని మహిళాలోకం సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది.



    ఇదిలా ఉంటే.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మహిళలు అనేక రంగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహిళలు, పురుషుల మధ్య అసమానతలు తొలగేందుకు మనం అందరం కలిసి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ప్రత్యేక ట్వీట్ చేశారు. దేశంలో మహిళలు సాధిస్తున్న విజయాలు చూసి... ఎల్లప్పుడూ గర్వ పడుతున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించేలా... ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

    ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే... వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాల్ని గుర్తించి... ప్రశంసిస్తారు. 1996 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని థీమ్‌తో జరుపుతున్నారు. ఆ సంవత్సరం ఐక్య రాజ్య సమితి... ఓ థీమ్ తెచ్చింది అది... గతాన్ని సెలబ్రేట్ చేసుకుందాం... భవిష్యత్‌కు ప్లాన్ వేసుకుందాం. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏటా ప్రత్యేక థీమ్‌తో మహిళా దినోత్సవం జరుగుతోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Home loan, Sbi, State bank of india, Womens day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు