SBI New Personal Loan: కరోనా కష్టకాలంలో కస్టమర్లకు అండగా ఎస్బీఐ.. ష్యూరిటీ లేకుండానే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్

ప్రతీకాత్మకచిత్రం

కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్లకు ఆర్థిక చేయూత అందించేందుకు ‘కవచ్​ పర్సనల్​ లోన్’​ పేరుతో ఈ పర్సనల్​ లోన్లను ప్రారంభించింది. ఎస్​బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకే, జీరో ఛార్జీలతో ఈ లోన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తమ కస్టమర్ల కోసం కొత్త రకం పర్సనల్​ లోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి ష్యూరిటీ పెట్టుకుండానే ఈ లోన్లను మంజూరు చేస్తుండటం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్లకు ఆర్థిక చేయూత అందించేందుకు ‘కవచ్​ పర్సనల్​ లోన్’​ పేరుతో ఈ పర్సనల్​ లోన్లను ప్రారంభించింది. ఎస్​బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకే, జీరో ఛార్జీలతో ఈ లోన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. కవచ్​ పర్సనల్​ లోన్​ కింద కస్టమర్లు రూ .25 వేల నుండి రూ .5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ లోన్​కు దరఖాస్తు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో పరిశీలించండి.

కవచ్​ పర్సనల్​ లోన్​ ప్రయోజనాలివే..

1. కరోనా వైరస్ చికిత్స కోసం ఎటువంటి ష్యూరిటీ లేకుండానే తక్కువ వడ్డీకే పర్సనల్​ లోన్​ అందిస్తోంది ఎస్​బీఐ. రుణగ్రహీతకు సంబంధించిన వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని రూ .25 వేల నుండి రూ .5 లక్షల మధ్య లోన్​ మంజూరు చేస్తుంది.

2. కవాచ్ పర్సనల్​ లోన్​ కింద తీసుకునే రుణాలకు 8.5% వార్షిక వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకే పర్సనల్​ లోన్​ అందిస్తుండటం గమనార్హం. అంతేకాదు, ఈ లోన్లకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. జప్తు ఛార్జీలు, జరిమానాలను కూడా ఎస్‌బిఐ మాఫీ చేసింది.

3. ఎస్​బీఐ అందజేస్తున్న కవాచ్ పర్సనల్​ లోన్ 5 సంవత్సరాల వ్యవధి కలిగి ఉంటుంది. అంతే, 60 నెలల్లోగా తీసుకున్న రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లోన్​ తీసుకన్న వారు మొదటి మూడు నెలల పాటు ఎటువంటి ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు.

4. శాలరీ పొందేవారు, పొందని వారు, పదవీ విరమణ చేసినవారు, వారి కుటుంబ సభ్యులు ఈ కొత్త వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

5. ఈ పర్సనల్​ లోన్​ కేవలం కరోనా చికిత్స కోసం ఉద్దేశించి ప్రారంభించారు. కాబట్టి, లోన్​ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కస్టమర్లు తమ డాక్యుమెంటేషన్‌లో కోవిడ్–-19 పాజిటివ్​ రిపోర్ట్​ను కూడా బ్యాంకుకు సమర్పించాలి.

6. 2021 ఏప్రిల్ 1న లేదా ఆ తరువాత కోవిడ్–-19 పాజిటివ్ వచ్చిన వారు మాత్రమే ఎస్​బిఐ కవాచ్ పర్సనల్ లోన్​కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

7. వినియోగదారులు వారి దగ్గర్లోని ఎస్​బీఐ బ్రాంచ్​ను సంప్రదించడం ద్వారా లేదా ఎస్​బీఐ యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్​ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు.

8. లోన్​ విజయవంతంగా మంజూరైన తర్వాత ఆ మొత్తం కస్టమర్ శాలరీ, పెన్షన్ లేదా సేవింగ్స్​ అకౌంట్​లో జమ అవుతుంది.

9. కోవిడ్​–19 సంబంధిత వైద్య ఖర్చుల కోసం, ఇప్పటికే చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడం కోసం కరోనా కవచ్​ లోన్​ను ప్రారంభించినట్లు SBI ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్లిష్ట సమయాల్లో కస్టమర్లకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ఎస్​బీఐ ఎప్పుడూ ముందుంటుందని తెలిపింది.

10. ఎస్​బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ "ఈ కష్ట సమయంలో మా కస్టమర్లు ఆర్థిక భరోసా కల్పించడమే మా లక్ష్యం.- దురదృష్టవశాత్తు ఎవరైనా కరోనా బారిన పడితే వారి చికిత్స కోసం అత్యవసరంగా నిధులు సమకూర్చడం కష్టమవుతుంది. అందుకే వారి అవసరాలను తీర్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాం” అని అన్నారు.
Published by:Krishna Adithya
First published: