State Bank Of India | దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు పలు రకాల సేవలు అందిస్తోంది. డబ్బులు దాచుకునే వారి కోసం టర్మ్ డిపాజిట్ సర్వీసులు అందుబాటులో ఉంచింది. సాధారణంగా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) బ్రేక్ చేసి అంటే మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు తీసుకుంటే చార్జీలు వసూలు చేస్తుంటాయి. చాలా వరకు బ్యాంకులు ఇదే రూల్‌ను అనుసరిస్తున్నాయి. అయితే ఎస్బీఐ సహా మరికొన్ని బ్యాంకులు మాత్రం ఈ విషయంలో కస్టమర్లకు ఊరట కలిగిస్తున్నాయి. మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకున్నా కూడా పెనాల్టీ లేకుండా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసులను స్టేట్ బ్యాంక్ అందుబాటులో ఉంచింది.
స్టేట్ బ్యాంక్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (SBI MODS) పేరుతో టర్మ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఇది కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. సాధారణ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ తరహా టర్మ్ డిపాజిట్ తెరిచిన వారు ఎప్పుడైనాసరే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ కింద ఎవరైనా అకౌంట్ తెరవొచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ ఉంది. రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎలాంటి వడ్డీ రేటు ఉంటుందో ఈ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు కూడా అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు 0.50 శాతం అధిక వడ్డీ వస్తుంది.
నెలకు రూ.1,000 కట్టండి.. రూ.2 కోట్లు మీవే!
ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కమ్ మెచ్యూరిటీ కాలం ఏడాది నుంచి ఐదేళ్లు వరకు ఉంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే 5.5 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 3 ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు టర్మ్ డిపాజిట్లపై అయితే 5.6 శాతం వరకు వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్‌లో మీరు డబ్బులు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్
అంతేకాకుండా ఈ ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. రెగ్యులర్ ఎఫ్‌డీల మాదిరిగానే టీడీఎస్ కూడా కట్ అవుతుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ఈ తరహా టర్మ్ డిపాజిట్ తెరిచిన వారికి విత్‌డ్రాయెల్స్ లిమిట్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఏటీఎం , చెక్ బుక్, బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే కస్టమర్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఇంకా ఆటో స్వీప్ ఫెసిలిటీ కూడా ఉంది. కస్టమర్లు రూ. 10 వేల కనీస మొత్తంతో ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద అకౌంట్ తెరవొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Fixed deposits, Sbi, Sbi deposits, Sbi yono