SBI: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌తో ఎక్కువ లాభం... ఎలాగో తెలుసుకోండి

SBI Multi Option Deposit Scheme | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? లేదా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఎక్కువ లాభమిచ్చే ఈ స్కీమ్ గురింి తెలుసుకోండి.

news18-telugu
Updated: May 28, 2020, 12:59 PM IST
SBI: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌తో ఎక్కువ లాభం... ఎలాగో తెలుసుకోండి
SBI: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌తో ఎక్కువ లాభం... ఎలాగో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల డిపాజిట్లపై భారీగా వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. అంతేకాదు... సేవింగ్స్ అకౌంట్‌పైన ఇచ్చే వడ్డీ రేటును కూడా భారీగా తగ్గించింది. ఏకంగా 2.75 శాతానికి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ తగ్గింది. అంటే సేవింగ్స్ అకౌంట్‌లో ఉండే బ్యాలెన్స్‌పై వచ్చే వడ్డీ ఏడాదికి 2.75 శాతం మాత్రమే. ఎక్కువ వడ్డీ కావాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మరి ఎక్కువ వడ్డీ పొందే మార్గమే లేదా? ఉంది. ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్-MODS అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ స్కీమ్ టర్మ్ డిపాజిట్‌కు లింక్ అయి ఉంటుంది. సాధారణంగా టర్మ్ డిపాజిట్ అయితే నిర్ణీత గడువు వరకు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో మాత్రం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతకావాలంటే అంత డ్రా చేసుకోవచ్చు.

ఉదాహరణకు మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 ఉన్నాయనుకుందాం. ఆ బ్యాలెన్స్‌కు వచ్చే వడ్డీ 2.75 శాతం మాత్రమే. అదే మీరు ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్-MODS అకౌంట్ ఓపెన్ చేస్తే టర్మ్ డిపాజిట్‌కు ఎంత వడ్డీ ఉంటే అంత వడ్డీ వస్తుంది. అంటే సుమారు 5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. మీరు ఆన్‌లైన్‌లో లేదా బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి టర్మ్ డిపాజిట్. రెండోది స్పెషల్ టర్మ్ డిపాజిట్. కనీసం ఒక ఏడాది డిపాజిట్ చేయాలి. గరిష్టంగా ఐదేళ్లు డిపాజిట్ చేయొచ్చు. టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు కనీసం రూ.10,000 జమ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.

ఆటోస్వీప్ పద్ధతిలో మీ డబ్బులు ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్-MODS అకౌంట్‌లోకి వెళ్తాయి. కనీస బ్యాలెన్స్ రూ.35,000 పైన ఉండే బ్యాలెన్స్ మాత్రమే ఈ స్కీమ్‌లోకి వెళ్తుంది. అది కూడా రూ.10,000 పైన ఉంటేనే సాధ్యం. ఉదాహరణకు మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 ఉంటే రూ.65,000 మాత్రమే మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్తుంది. దీన్నే ఆటోస్వీప్ అంటారు. ఆటోస్వీప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్

SBI Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల డబ్బులు చేతికొస్తాయి

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్
First published: May 28, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading