SBI Moratorium: 6 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువ కట్టాలి... ఇదీ లెక్క

SBI EMI Moratorium | మీరు మారటోరియం ఎంచుకుంటున్నారా? మీ ఈఎంఐలను వాయిదా వేస్తున్నారా? ఈఎంఐలు వాయిదా వేస్తే ఎంత నష్టమో ఈ ఊదాహరణలతో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 29, 2020, 2:52 PM IST
SBI Moratorium: 6 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువ కట్టాలి... ఇదీ లెక్క
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా-RBI అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మరో మూడు నెలలు మారటోరియం పొడిగించిన సంగతి తెలిసింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లకు ఈఎంఐ వాయిదా వేసే అవకాశాన్ని కల్పించింది. అంటే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మార్చి 1 నుంచి మే 31 వరకు మొదటి విడత, జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు రెండో విడత మారటోరియం ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభించింది. అంతేకాదు... మొదటి విడత మారటోరియం ఎంచుకోనివారు కూడా రెండో విడతలో మారటోరియం ఎంచుకొని ఈఎంఐలు వాయిదా వేసుకోవచ్చు. మారటోరియం ఆప్షన్ ఎంచుకోవాలనుకునే కస్టమర్లు తమ సమ్మతిని బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఎస్ఎంఎస్‌లో సూచించిన ఫార్మాట్‌లో మెసేజ్ పంపాలి.

మీరు మీ ఈఎంఐలు వాయిదా వేయకూడదనుకుంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే ఈఎంఐలు చెల్లిస్తే చాలు. వాళ్లు బ్యాంకుకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈఎంఐ వాయిదా వేయాలనుకుంటే మాత్రం బ్యాంకు పంపిన మెసేజ్‌లో ఉన్న నెంబర్‌కు YES అని మెసేజ్ వచ్చిన ఐదు రోజుల్లో ఎస్ఎంఎస్ చేయాలి. ఈఎంఐలు వాయిదా వేస్తే మీ లోన్ ఔట్ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఏఏ లోన్లపై మారటోరియం ప్రభావం ఎలా ఉంటుందో ఎస్‌బీఐ ఉదాహరణలతో సహా వివరించింది. ఆ ఉదాహరణలు చూడండి.

Auto Loan: ఓ వ్యక్తి రూ.6 లక్షల ఆటో లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 54 నెలలు ఈఎంఐ చెల్లించాలి. మొదట మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయడంతో పాటు మరో మూడు నెలలు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి అదనంగా రూ.36,000 వడ్డీ చెల్లించాలి. అంటే 3 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.19,000 వడ్డీ చెల్లించాలి. ఇది 1.5 ఈఎంఐతో సమానం.

Home Loan: ఓ వ్యక్తి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 15 ఏళ్లు ఈఎంఐలు చెల్లించాలి. ఆ వ్యక్తి మొదట మూడు నెలలతో పాటు మరో మూడు నెలలు మారటోరియం ఎంచుకున్నాడు. ఔట్‌స్టాండింగ్‌పై సుమారు రూ.4,54,000 వడ్డీ చెల్లించాలి. ఇది 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.2,34,000 వడ్డీ చెల్లించాలి. ఇది 8 ఈఎంఐలతో సమానం. అంటే రెండుసార్లు మారటోరియం ఆప్షన్ ఎంచుకొని 6 ఈఎంఐలు వాయిదా వేస్తే అదనంగా 16 ఈఎంఐలు కట్టాలి. అందుకే మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే నష్టం తప్ప లాభం లేదు. ఈఎంఐలు చెల్లించడానికి అస్సలు డబ్బులు లేని పరిస్థితి ఉంటేనే మారటోరియం ఎంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈఎంఐలు చెల్లించడమే మేలు.

ఇవి కూడా చదవండి:

Lockdown: లాక్‌డౌన్‌లో బాగా నడిచిన బిజినెస్ ఇదే... వ్యాపారం చేయడానికి ప్రభుత్వ సాయం

Credit Card: డబ్బులు లేవా? క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టండి ఇలాBusiness Idea: వ్యాపారం చేసే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం

 
First published: May 29, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading