SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా

SBI Mobile Banking | ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేసుకోవాలంటే బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్ఎంఎస్ లేదా ఏటీఎం ద్వారా రిజిస్టర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 20, 2020, 5:44 PM IST
SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా
SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? లాక్‌డౌన్ కారణంగా బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోలేకపోతున్నారా? ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌తో అనేక సేవల్ని పొందొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మొబైల్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్, చెక్ బుక్ రిక్వెస్ట్, ఇ-స్టేట్‌మెంట్ లాంటివన్నీ ఇంటి నుంచే చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి మొబైల్ బ్యాంకింగ్ సేవలకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే బ్యాంకుకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఏటీఎంలో మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

SBI Mobile Banking: రిజిస్టర్ చేయండి ఇలా



ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి.
MBSREG అని టైప్ చేసి 9223440000 లేదా 567676 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి.
మీకు ఎస్ఎంఎస్‌లో యూజర్ ఐడీ, ఎంపిన్ వస్తుంది.
ఎస్ఎంఎస్‌లో వచ్చిన లింక్ క్లిక్ చేసి మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
మీ యూజర్ ఐడీ, పిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.ఏటీఎం ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలకు రిజిస్టర్ చేయొచ్చు.
ఎస్‌బీఐ ఏటీఎంలో ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత Mobile Registration ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్‌కు యాక్టివేషన్ మెసేజ్ వస్తుంది.

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఏటీఎం కార్డుపై జూన్ 30 వరకు ఆ ఛార్జీల్లేవ్

JioPOS Lite App: ఈ జియో యాప్‌తో డబ్బు సంపాదించండి ఇలా

LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే
First published: April 20, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading