SBI Mutual Fund: రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ను ప్రారంభించిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్

ప్రతీకాత్మక చిత్రం

ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్‌ను ప్రారంభించింది. దీన్ని 2021, ఫిబ్రవరి 3వరకు కొనుగోలు చేయవచ్చు.

  • Share this:
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్‌ను ప్రారంభించింది. దీన్ని 2021, ఫిబ్రవరి 3వరకు కొనుగోలు చేయవచ్చు. రిటైర్ మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్. ఇది వివిధ రిస్క్ ప్రొఫైల్స్‌తో, నాలుగు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను అందిస్తుంది. అగ్రెసివ్, అగ్రెసివ్ హైబ్రిడ్, కన్సర్వేటివ్ హైబ్రిడ్, కన్సర్వేటివ్‌ ప్లాన్‌లను వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో SIP ద్వారా ఇన్వెస్ట్ చేసేవారు రూ.50 లక్షల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు. ఈ ఎస్‌బీఐ స్కీమ్‌లు ఫారెన్ ఈక్విటీలు, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్‌లలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ ఇందుకు ఆస్తుల కేటాయింపు, పెట్టుబడుల వ్యూహాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అగ్రెసివ్ ప్లాన్‌లో భాగంగా ఫారెన్ ఈటీఎఫ్‌లు వంటి ఓవర్సీస్ సెక్యూరిటీల్లో కూడా 35 శాతం వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌లో కనీసం రూ.5వేలతో పెట్టుబడులు ప్రారంభించవచ్చు.

పెట్టుబడిదారులకు లాభాలు
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫండ్ ద్వారా ఈక్విటీలో చేసిన పెట్టుబడులపై 10 శాతం వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకంటే మెరుగైన రాబడిని అందించగలదు. కానీ రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ పథకానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎన్‌పీఎస్‌లో మెచూరిటీ సమయంలో అందే రాబడిలో 60 శాతంపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. కానీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌లో, మెచ్యూరిటీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే సమయంలో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఎలాంటి ట్యాక్స్ మినహాయింపు ఉండదు.

ఇన్సూరెన్స్ ఉంటుంది
NPS పథకంలో ఒక పెట్టుబడిదారుడు ఈక్విటీలో 50 శాతం, డెట్ స్కీమ్‌లలో 50 శాతం పెట్టుబడులను ఎంచుకుంటే... 10 శాతం వరకు రిటర్న్స్ పొందవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌లో SIP ద్వారా ఇన్వెస్ట్ చేసేవారికి టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎన్‌పీఎస్‌లో ఇలాంటి ఇన్సూరెన్స్ ఆఫర్ లేదు. దీంతో పెట్టుబడిదారులు ఎస్‌బీఐ రిటైర్మెంట్ ఫండ్‌లపై ఆసక్తి చూపవచ్చు. ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ తరువాత ఎక్కువ మొత్తాన్ని ఆశించే పెట్టుబడులను కోరుకుంటున్నారా లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కోరుకుంటున్నారా అనేది నిర్ణయించుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్ ఫోలియోను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి.
Published by:Krishna Adithya
First published: