హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Mutual Fund: ఎస్‌బీఐ కొత్త స్కీమ్.. డబ్బు సంపాదించాలనే వారికి అద్భుత అవకాశం, రూ.5 వేలతో చేరొచ్చు!

SBI Mutual Fund: ఎస్‌బీఐ కొత్త స్కీమ్.. డబ్బు సంపాదించాలనే వారికి అద్భుత అవకాశం, రూ.5 వేలతో చేరొచ్చు!

 SBI Mutual Fund: ఎస్‌బీఐ కొత్త స్కీమ్.. డబ్బు సంపాదించాలనుకునే వారికి అద్భుత అవకాశం, రూ.5 వేలతో చేరొచ్చు!

SBI Mutual Fund: ఎస్‌బీఐ కొత్త స్కీమ్.. డబ్బు సంపాదించాలనుకునే వారికి అద్భుత అవకాశం, రూ.5 వేలతో చేరొచ్చు!

Mutual Fund | మీరు కొత్తగా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే ఎస్‌బీఐ కొత్త స్కీమ్ తెచ్చింది. కేవలం రూ. 5 వేల కనీస ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇందులో చేరొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

MF SIP | మీరు అదనపు ఆదాయం పొందాలని భావిస్తున్నరా? అయితే మీకు శుభవార్త. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చింది. డెట్ మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) స్కీమ్‌ లాంచ్ చేసింది. దీని పేరు ఎస్‌బీఐ (SBI) ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్ సిరీస్ 77 (366 రోజులు). ఈ ఫండ్ ఎన్ఎఫ్‌వో ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 13 వరకు ఇది కొనసాగుతుంది. ఇది క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. అంటే మెచ్యూరిటీ తర్వాతనే ఈ ఫండ్ స్కీమ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం వీలవుతుంది.

ఎస్‌బీఐ తీసుకువచ్చిన కొత్త మ్యూచువల్ ఫండ్‌లో మీరు రూ. 5 వేల నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుంది. డెట్ కేటగిరి ఫండ్. క్రిసిల్ షార్ట్ టర్మ్ బాండ్ ఇండెక్స్ ఈ మ్యూచువల్ ఫండ్‌కు బెంచ్‌మార్క్. ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఈ స్కీమ్ టెన్యూర్ 366 రోజుల. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు కూడా ఎన్ఎఫ్‌వోలో భాగంగా ఈ కొత్త ఫండ్‌లో డబ్బులు పెట్టొచ్చు.

బంపరాఫర్.. రూ.7 లక్షల ట్రాక్టర్ ఫ్రీ, ఉచితంగా 8 గ్రాముల బంగారం.. ఎలా పొందాలంటే?

డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే నేరుగా డైరెక్ట్‌గా ఇందులో డబ్బులు పెట్టొచ్చు. రెగ్యులర్ ఇన్‌కమ్, మూలధనం పెరుగుదల, తక్కువ రిస్క్ వంటివి కోరుకునే వారు ఈ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని మ్యూచువల్ ఫండ్ హౌస్ పేర్కొంటోంది. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ప్రధానంగా డెట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే కచ్చితమై రాబడికి గ్యారంటీ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడే ఉంటాయి.

బ్యాంక్ అదిరే ఆఫర్.. కేవలం 62 పైసల వడ్డీకే 10 నిమిషాల్లో గోల్డ్ లోన్, చార్జీలు మాఫీ!

అందువల్ల కచ్చితంగా ఇతర లాభం వస్తుందని చెప్పడానికి అవకాశం ఉండదు. కాగా కేవలం రూ. 5 వేల కనీస మొత్తంతో ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కాగా నేరుగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడే వారు ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని వల్ల రిస్క్ కొంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోతే డబ్బులు పెట్టడం వల్ల మొత్తం పోగొట్టుకోవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే పండ్ మేనేజర్లు ఉంటారు. వీళ్లు మ్యూచువల్ ఫండ్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తారు. అందువల్ల పెట్టిన డబ్బులుకు స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే కొంత మేర భద్రత లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలను అందిస్తాయని గుర్తించుకోవాలి.

First published:

Tags: Banks, Investments, Mutual Funds, Sbi, SIP, State bank of india

ఉత్తమ కథలు