Home /News /business /

SBI MF LAUNCHES SBI BALANCED ADVANTAGE FUND WITH MINIMUM SIP RS 500 PER MONTH SS GH

SBI MF: ఎస్​బీఐ నుంచి కొత్త మ్యూచువల్​ ఫండ్​... నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే చాలు

SBI MF: ఎస్​బీఐ నుంచి కొత్త మ్యూచువల్​ ఫండ్​... నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI MF: ఎస్​బీఐ నుంచి కొత్త మ్యూచువల్​ ఫండ్​... నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Balanced Advantage Fund | మీరు ఏదైనా కొత్త మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో నెలకు రూ.500 పొదుపు చేస్తే చాలు.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) మ్యూచువల్​ ఫండ్​ సేవలను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎస్​బీఐ తాజాగా కొత్త ఫండ్ ఆఫర్ (NFO)ను ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభమైన ఈ మ్యూచువల్​ ఫండ్​ ఆఫర్​ ఆగస్టు 25తో ముగుస్తుంది. ఎస్​బీఐ కొత్తగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఓపెన్-ఎండ్ డైనమిక్ అసెట్ అలొకేషన్​ ఫండ్స్​ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం ద్వారా అస్థిర ఈక్విటీ మార్కెట్లలో నష్టాలను తగ్గించి లాభాలను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన ఎన్​ఎఫ్​ఓలో ఇన్వెస్టర్లు చేరాలంటే  డీమ్యాట్​, ట్రేడింగ్​ అకౌంట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్​ ఎండెడ్​ స్కీమ్​.

Life Insurance: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు... 100 ఏళ్ల వరకు కవరేజీ ఇచ్చే పాలసీ

ATM New Rule: ఏటీఎంలో డబ్బులు లేవా? రూ.10,000 ఫైన్ చెల్లించనున్న బ్యాంకులు

దీర్ఘకాలంలో క్యాపిటల్​ అప్రిసియేషన్​ కోరుకునే వారికి ఇది బెస్ట్​ ఆప్షన్​గా చెప్పవచ్చు. దీనిలో కనీస పెట్టుబడి కింద రూ .5,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త మ్యూచువల్​ ఫండ్​ను ఆర్గనైజ్​ చేసేందుకు కొత్త మేనేజర్లను కూడా నియమించారు. ఎస్​బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కోసం దినేశ్ బాలచంద్రన్, ఈక్విటీ పోర్షన్​ కోసం గౌరవ్ మెహతా, డెట్ పోర్షన్ కోసం దినేశ్ అహుజా, విదేశీ పెట్టుబడులను నిర్వహించడానికి మోహిత్ జైన్​లను సంస్థ నియమించింది. "SBI బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ మొత్తం స్కీమ్ పోర్ట్‌ఫోలియోలో లాభాలను అందించడానికి, దీర్ఘకాలిక సంపాదన రెట్టింపు చేసేందుకు, స్థిర ఆదాయం కోసం ఉపయోగపడుతుంది" అని ప్రకటనలో పేర్కొంది. వాల్యుయేషన్స్​, ఎర్నింగ్​ డ్రైవర్స్​, సెంటిమెంట్ ఇండికేటర్​ వంటి పారామీటర్ల ఆధారంగాఎస్‌బిఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్​ను నిర్వహిస్తారు.

PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

Aadhaar Number: ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

ఆగస్టు 25 వరకు పెట్టుబడికి ఛాన్స్​


ఈ ఫండ్​ కింద ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత ఇన్​స్ట్రుమెంట్లలో 0 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డెట్ సెక్యూరిటీస్​, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో కనీసం 0 శాతం గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు. REIT ల ద్వారా జారీ చేసిన యూనిట్లలో 0 శాతం నుంచి 10 శాతం వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్​ పేర్కొంది.

దీనిపై ఎస్​బీఐ ఎంఎఫ్ ఎండీ, సీఈవో వినయ్ టోన్స్ మాట్లాడుతూ "ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా గ్లోబల్ లిక్విడిటీ ద్వారా నడిపిస్తారు. ఈ సమయంలో ఎస్​బీఐబ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. మా కొత్త ఫండ్ ఆఫర్ ఈక్విటీ, డెట్‌లో లాభాలు ఆర్జించేందుకు, పెట్టుబడిని అంచనా వేయడానికి మూడంచెల పెట్టుబడి వ్యూహాన్ని అనుసరిస్తుంది. బలమైన ఆర్థిక, మార్కెట్ సూచికల ఆధారంగా దీన్ని అంచనా వేస్తుంది," అని ఎస్​బీఐ ఎంఎఫ్​ ఎండీ, సీఈవో వినయ్ టోన్స్ పేర్కొన్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Investment Plans, Mutual Funds, Personal Finance, Save Money, Sbi, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు