• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • SBI MEGA E AUCTION FOR PROPERTIES LIKE HOUSING RESIDENTIAL COMMERCIAL INDUSTRIAL HERE DATE AND OTHER DETAILS NS

SBI Mega E-Auction: అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు.. ఈ-వేలం ప్రకటించిన SBI.. వివరాలివే

SBI Mega E-Auction: అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు.. ఈ-వేలం ప్రకటించిన SBI.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్ విలువ కన్నా తక్కువ మొత్తంతో ఇళ్లు, స్థలం, వాహనాలను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే.. మీ కిది శుభవార్తే! ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    మార్కెట్ విలువ కన్నా తక్కువ మొత్తంతో ఇళ్లు, స్థలం, వాహనాలను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే.. మీ కిది శుభవార్తే! ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తులను ఈ-వేలం వేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. మార్చి 5న ఈ-వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బ్యాంకు వేలం వేయనున్న వాటిలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ తో పాటు ల్యాండ్, మిషనరీ, వెయికిల్స్ మొదలైనవి ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ వేలానికి హాజరు కావాలని బ్యాంకు సూచించింది. ఈ వేలం విషయంలో తాము అత్యంత పారదర్శకంగా ఉంటామని బ్యాంకు తెలిపింది. వేలం వేసే ప్రాపర్టీస్ కు సంబంధించిన కోర్టు ఉత్తర్వులతో కావాల్సిన పత్రాలు, వివరాలు అందిస్తామని తెలిపింది.



    ఈ-వేలంలో పాల్గొనడానికి ఏం కావాలంటే..
    -ఈ-వేలం నోటీసులో సూచించిన మాదిరిగా నిర్దిష్ట ఆస్తి కోసం EMD.
    -KYC పత్రాలను సంబంధిత ఎస్‌బీఐ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
    -డిజిటల్ సంతకం: డిజిటల్ సంతకాన్ని పొందటానికి బిడ్డర్లు ఈ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అధికారిక ఏజెన్సీని సంప్రదించవచ్చు
    -వేలంలో పాల్గొనే వారు EMD డిపాజిట్, KYC పత్రాలను సంబంధిత శాఖలో సమర్పించిన తర్వాత వారి ఈ మెయిల్ ఐడీకి రిజిస్టర్డ్ లాగిన్ ID, పాస్వర్డ్ ను పంపిస్తారు.
    -ఇతర వివరాలకు ఈ లింక్ ను సందర్శించవచ్చు
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు