SBI Life eShield Next: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఎస్‌బీఐ నుంచి కొత్త పాలసీ

SBI Life eShield Next: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఎస్‌బీఐ నుంచి కొత్త పాలసీ (image: SBI Life)

SBI Life eShield Next Term Insurance | మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ లైఫ్ ఇషీల్డ్ నెక్స్‌ట్ (SBI Life eShield Next) పేరుతో కొత్త టర్మ్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీతో వచ్చే బెనిఫిట్స్ తెలుసుకోండి.

  • Share this:
ఈ మధ్య కాలంలో ఎస్‌బీఐ అందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా టర్మ్ పాలసీలను (Term Insurance Policy) కస్టమర్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటీవలే ఎస్‌బీఐ తన టర్మ్ పాలసీ ఈ-షీల్డ్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో ఈ-షీల్డ్‌ నెక్స్ట్ (SBI eShield Next) ప్లాన్‌ను ప్రకటించింది. ఇది నాన్- లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే పూర్తిగా రిస్క్ ప్రీమియం ప్రొడక్ట్. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి జీవితంలో వివాహం చేసుకోవడం, సంతానం పొందడం లేదా ఇల్లు కొనుగోలు చేయడం లాంటి మైలురాళ్లను చేరుకున్నప్పుడు.. ఆ స్థాయికి తగ్గట్లు పాలసీదారులకు ఇది అదనపు రక్షణను, ఆర్థిక భరోసాను అందిస్తుంది.

ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్‌ నెక్స్ట్ ఆప్షన్స్


ఇందులో మూడు ప్లాన్ ఆప్షన్లు ఉన్నాయి. లెవల్ కవర్, కవర్‌ను పెంచడం, భవిష్య ప్రయోజనాల కోసం లెవల్ కవర్ చేయడం లాంటి ఆప్షన్లు ఉన్నాయి. ప్రతి ఆప్షన్‌ను వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించారు. ప్రారంభంలో ఏదైనా ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ వ్యవధి మధ్యలో మార్చలేం. ఇంతకుముందు ఉన్న ఈ-షీల్డ్‌లో కేవలం ఒకే ఆప్షన్ ఉండి, మార్చలేని మొత్తాన్ని అందించేది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ-షీల్డ్‌ నెక్స్ట్ లో మీ వయస్సు పైబడిన తర్వాత బీమా కవర్ మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్‌ ఉంది.

Aadhaar-Ration card linking: ఆధార్‌ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయాలా... ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే

ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్‌ నెక్స్ట్ ఫీచర్లు


విభిన్న రక్షణ అవసరాలను తీర్చడానికి మూడు ప్లాన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. లెవల్ కవర్, కవరేజీని పెంచడం, భవిష్యత్తు ప్రయోజనాలతో కూడిన లెవల్ కవర్. ఈ బీమా కవరేజీ 100 ఏళ్ల వరకు(మొత్తం జీవితం) లేదా 85 ఏళ్ల వరకు ఉంటుంది. నిర్దిష్ట అవసరాలకు తగినట్లుగా ఓ ప్లాన్ ను రూపొందించారు. అంటే దీని ద్వారా బెట్టర్ హాఫ్ బెనిఫిట్ ఆప్షన్, మరణ ప్రయోజనాల చెల్లింపులు ఉంటాయి. మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా ప్రీమియం చెల్లించవచ్చు. అంటే ఒక్కసారిగా లేదా లిమిటెడ్ టైమ్ లో లేదా పాలసీ వ్యవధిలో పేమెంట్ చేయవచ్చు.

myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే

మొదటి ఆప్షన్: లెవల్ కవర్ బెనిఫిట్ విషయంలో చెల్లించాల్సిన మొత్తం పాలసీ వ్యవధి అంతటా స్థిరంగా ఉంటుంది.

రెండో ఆప్షన్: కవరేజీని పెంచే ఆప్షన్ వల్ల మరణం మీద ఇచ్చే హామీపై ఏడాదికి 10 శాతం వడ్డీ పెరుగుతుంది. ప్రతి 5వ పాలసీ సంవత్సరం(5th Policy Year) చివర్లో ప్రాథమిక బీమా మొత్తంలో గరిష్ఠంగా 100 శాతం పెరుగుతుందనే హామీ ఉంటుంది.

మూడో ఆప్షన్: ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ తో లెవల్ కవర్ ఆప్షన్ లో వివాహం చేసుకోవడం లేదా తల్లిదండ్రులుగా మారడం లేదా ఇల్లు కొనుగోలు చేయడం లాంటి విషయాల్లో ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవచ్చు.

Aadhaar Card Update: తెలుగులో మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయండి ఇలా

ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్‌ నెక్స్ట్ ఎంచుకోవడానికి ఐదు కారణాలు...


1. ఈ సరికొత్త పాలసీ సెక్యూరిటీ- కుటుంబ ఆర్థిక భద్రతకు హామీ ఇస్తుంది

2. ఫ్లెక్సిబిలిటీ- మూడు ఆప్షన్ల నుంచి ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది

3. సులభతరం- ప్యాకేజీని పర్సనలైజ్ చేసుకోవడానికి ఆప్షనల్ బెనిఫిట్లు ఉపయోగించుకోవచ్చు

4. అందుబాటు ధర- మీకు తీరిక ఉన్నప్పుడు ప్రీమియం చెల్లించవచ్చు.

5. విశ్వసనీయత- 100 ఏళ్ల కాలపరిమితి లేదా 85 ఏళ్ల వరకు రిలయబిలిటీని కలిగి ఉంది.
Published by:Santhosh Kumar S
First published: