హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI CARD: స్టేట్ బ్యాంక్ నుంచి ‘క్యాష్‌బ్యాక్ SBI కార్డ్‌’ లాంచ్‌.. అదిరిపోయే బెనిఫిట్స్ ఇవే..

SBI CARD: స్టేట్ బ్యాంక్ నుంచి ‘క్యాష్‌బ్యాక్ SBI కార్డ్‌’ లాంచ్‌.. అదిరిపోయే బెనిఫిట్స్ ఇవే..

SBI Launches Cash Back Card (PC : Twitter)

SBI Launches Cash Back Card (PC : Twitter)

SBI CARD: బ్యాంకింగ్ సెక్టార్‌లో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కస్టమర్లకు వినూత్న సేవలను చేరువ చేస్తోంది SBI. ఈ బ్యాంక్ తాజాగా మరో కొత్తరకం కార్డును ప్రవేశపెట్టింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బ్యాంకింగ్ సెక్టార్‌లో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కస్టమర్లకు వినూత్న సేవలను చేరువ చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఈ బ్యాంక్ తాజాగా మరో కొత్తరకం కార్డును ప్రవేశపెట్టింది. క్యాష్‌బాక్‌ సిస్టమ్‌ (Cashback System)ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కొత్తగా 'క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్(Cash Back SBI Card)' అనే సరికొత్త కార్డ్‌ను లాంచ్‌ చేసింది. దీని ప్రయోజనాలు, ప్రత్యేకతలు చూద్దాం.

* క్యాష్‌బ్యాక్ కోసమే..

ఈ కొత్త కార్డ్ ప్రతి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఆఫ్‌లైన్‌ పేమెంట్స్, యుటిలిటీ బిల్లు పేమెంట్స్‌పై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌పై, ప్రతిచోట క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే లక్ష్యంతో క్యాష్‌‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్‌ను రూపొందించినట్లు ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈవో రామమోహన్‌ రావు అమర తెలిపారు. పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఎస్‌బీఐ కార్డ్ నిరంతరం కృష్టి చేస్తుందని వివరించారు.

* మొదటి ఏడాది ఉచితం

ఈ కార్డును అందించేందుకు ఎస్‌బీఐ ఎలాంటి జాయినింగ్‌ ఫీజు వసూలు చేయకపోవడం గమనార్హం. కస్టమర్లు డిజిటల్ అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్ ‘ఎస్‌బీఐ కార్డ్ స్ప్రింట్‌’ ద్వారా తాజా కార్డ్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా అన్ని ప్రివిలైజ్‌లు పూర్తిగా ఉచితమని ఎస్బీఐ తెలిపింది.

కార్డ్ హోల్డర్ రెండో సంవత్సరం నుంచి రూ.999+ ట్యాక్స్‌ రెన్యువల్ ఛార్జీలు చెల్లించాలి. అయితే ఒక ఏడాదిలో రూ.2 లక్షలకు పైగా కార్డ్‌ ద్వారా స్పెండ్‌ చేస్తే.. రెన్యువల్ ఛార్జీలను తిరిగి పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్‌ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది.

* బెస్ట్‌ బెనిఫిట్స్‌ ఇవే..

ఈ కార్డ్‌ ద్వారా సంవత్సరానికి నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్స్‌(త్రైమాసికానికి ఒక విజిట్‌) లభిస్తుంది. రూ.500 నుంచి రూ.3 వేల వరకు చేసే ట్రాన్సాక్షన్‌లపై 1 శాతం ఫ్యూయల్‌ సర్‌ఛార్జీ మాఫీ అవుతుంది. ఇలా నెలకు గరిష్టంగా రూ.100 సర్‌ఛార్జ్ మాఫీ పొందవచ్చు. వీసా ప్లాట్‌ఫారమ్‌లో ‘క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్’ అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి : ఇండియాలో కియా సోనెట్ X-లైన్‌ ఎస్‌యూవీ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి..

కార్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 మిలియన్లకు పైగా అవుట్‌లెట్‌లలో వినియోగించవచ్చు. ఇండియాలోని 3,25,000 అవుట్‌లెట్‌లలో క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్‌ను ఉపయోగించవచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్డ్ ఒక్క ట్యాప్‌తో కాంటాక్ట్‌ లెస్‌ ట్రాన్సాక్షన్‌లను అందిస్తుంది.

‘క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డ్ మా కోర్ కార్డ్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కృషి చేస్తూనే ఉంటుంది. కార్డ్ హోల్డర్లు క్యాష్‌బ్యాక్స్‌పై పెడుతున్న దృష్టిని మేం అంచనా వేశాం. అందుకే ఈ స్పెషల్ కార్డును సరైన సమయంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రాబోయే పండుగ సీజన్‌లో ఈ క్యాష్‌బ్యాక్‌ కార్డును కస్టమర్లు ఎక్కువగా వినియోగించి, ప్రయోజనాలను పొందవచ్చు.’ అని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ రామమోహన్ రావు వివరించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Personal Finance, Sbi, Sbi card, State bank of india

ఉత్తమ కథలు