• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • SBI KYC UPDATE BANK ALLOWS CUSTOMERS TO SUBMIT DOCUMENTS THROUGH MAIL MK GH

SBI update: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో ఖాతా ఉందా?.. అయితే మీకో గుడ్​న్యూస్​...

SBI update: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో ఖాతా ఉందా?.. అయితే మీకో గుడ్​న్యూస్​...

SBI Zero Balance Account: ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు... ఓపెన్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI KYC update: ఈ–మెయిల్ ద్వారా KYC అప్​డేట్​.. కరోనా నేపథ్యంలో ఎస్​బీఐ ఖాతాదారులకు పెద్ద రిలీఫ్​​...

  • Share this:
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)లో ఖాతా ఉందా?.. అయితే, మీకో గుడ్​న్యూస్​. దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంతో కస్టమర్ల సౌకర్యార్థం ఎస్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నో యువర్​ కస్టమర్​ (కేవైసీ) కోసం కస్టమర్లు ఎస్​బీఐ బ్యాంకు కార్యాలయాలకు రావాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఆయా కస్టమర్లు తమ అధికారిక మెయిల్ ఐడీ లేదా పోస్ట్ ద్వారా ఇంటి నుంచే కేవైసీ అప్​డేట్​ చేసుకోవచ్చని తెలిపింది. ఖాతాదారులకు ఈ వెసులుబాటు కల్పించాలని దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు గుమికూడితే వారితో పాటు ఉద్యోగులకు కరోనా సంక్రమించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అందుకే భౌతిక సందర్శనలకు బదులుగా మెయిల్ లేదా పోస్ట్ ద్వారా KYC అప్​డేట్​ రిక్వెస్ట్​ను అంగీకరించాలని బ్యాంకు అధికారులకు తెలియజేసింది.

ఈ నిర్ణయంపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ.. “దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో అత్యవసర సర్వీసులు మినహా మిగతా సర్వీసులను ఇంటి నుంచి ఆన్​లైన్​ ద్వారానే పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దీంట్లో భాగంగానే కేవైసీ విషయంలో ఇబ్బందులకు చెక్​పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాం. కస్టమర్లు పోస్ట్ లేదా రిజిస్టర్డ్ ఈ–మెయిల్ ద్వారా తమ కేవైసీ అప్​డేట్​ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. KYC అప్​డేట్​ కోసం కస్టమర్లు వ్యక్తిగతంగా బ్యాంకు బ్రాంచికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాక కేవైసీ అప్​డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం” అని ఎస్​బీఐ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

మే 31 వరకు కేవైసీ అప్​డేట్​ గడువు..
ఈ–మెయిల్​ ద్వారా కేవైసీ అప్​డేట్​ కోసం మే 31 వరకు అవకాశం ఇవ్వడం ఖాతాదారులకు పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. సాధారణంగా లోన్​ తీసుకున్న లో రిస్క్​ కస్టమర్లు ప్రతి పదేళ్లకు ఒకసారి కేవైసీ అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీడియం రిస్క్​ ఉన్న కస్టమర్లు 8 ఏళ్లకు, హైరిస్క్​ ఉన్న కస్టమర్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీ అప్​డేట్​ చేసుకోవాలని బ్యాంకులు కోరుతుంటాయి. ఎస్​బీఐ నిర్ణయానికి అనుగుణంగా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉంది.
First published:

అగ్ర కథనాలు