SBI KYC Fraud: కేవైసీ మోసాలు నిజమే... ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్న ఎస్‌బీఐ

SBI KYC Fraud: కేవైసీ మోసాలు నిజమే... ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్న ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)

SBI KYC Fraud | కేవైసీ మోసాలు నిజమేనంటూ బ్యాంకు కస్టమర్లను హెచ్చరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కేవైసీ మోసాల గురించి తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. కొంతకాలంగా కేవైసీ మోసాలకు ఎస్‌బీఐ కస్టమర్లు టార్గెట్ అవుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. ఈ మోసాల వెనుక చైనాకు చెందిన హ్యాకర్లు ఉన్నారన్న విషయం కూడా తేలింది. దీంతో ఎస్‌బీఐ అప్రమత్తమైంది. తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. కేవైసీ మోసాలు నిజమేనని జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తోంది. దేశమంతా ఈ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తోంది. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు ఎస్‌బీఐ కస్టమర్లకు వల వేస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా మూడు సూచనలు చేస్తోంది ఎస్‌బీఐ. ఎస్‌ఎంఎస్‌లో, వాట్సప్‌లో కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే లింక్స్‌ని క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని ఎస్‌బీఐ చెబుతోంది. మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది.

    ఎస్‌బీఐలో 42 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. దాదాపు ప్రతీ గ్రామానికి ఎస్‌బీఐ విస్తరించింది. కస్టమర్ల సంఖ్య ఎక్కువ కావడంతో మోసగాళ్లు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. కేవైసీ స్కామ్, గిఫ్ట్ స్కామ్‌లకు తెరతీశారు. ఈ మోసాల వెనుక చైనాకు చెందిన హ్యాకర్లు ఉన్నట్టు న్యూ ఢిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, ఆటోబాట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇటీవల తేల్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ పరిశోధనలో రెండు రకాల మోసాలు బయటపడ్డాయి. కేవైసీ స్కామ్, గిఫ్ట్ స్కామ్‌ల వెనుక చైనా హ్యాకర్లు ఉన్నట్టు తేలింది. ఈ మోసాలు నిజమేనని ఎస్‌బీఐ కూడా చెబుతోంది.

    IFSC Codes: ఖాతాదారులకు అలర్ట్... ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారాయి

    Currency Note: ఈ మూడు పాత నోట్లు మీ దగ్గరున్నాయా? రూ.1,00,000 మీవే


    కేవైసీ స్కామ్ ఎలా జరుగుతుందో పరిశీలిస్తే ముందుగా ఎస్‌బీ కస్టమర్లు కేవైసీ వెరిఫికేషన్ చేయాలంటూ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఆ ఎస్ఎంఎస్‌లో వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి కేవైసీ అప్‌డేట్ చేయాలని ఉంటుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్ ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను పోలినట్టుగానే ఉంటుంది. దీంతో కస్టమర్లు అది అధికారిక వెబ్‌సైట్ అనే నమ్ముతున్నారు. అందులో వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరో కొత్త పేజీలో ఖాతాదారుల వివరాలన్నీ ఎంటర్ చేయాలని ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఫుల్ కేవైసీ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలు ఎంటర్ చేస్తే కస్టమర్ల ఖాతాలు ఖాళీ అయిపోతాయి.

    Stock Market: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రూ.26,000 లాభం

    Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా

    ఫ్రీ గిఫ్ట్స్‌ పేరుతో మరో తరహా మోసానికి టార్గెట్ అవుతున్నారు ఎస్‌బీఐ కస్టమర్లు. వాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఎస్‌బీఐ ఫోటోతో ఓ సర్వే లింక్ ఉంటుంది. ఆ సర్వే పూర్తి చేస్తే రూ.50 లక్షలు గెలుచుకోవచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. ఇందులో కూడా కస్టమర్ల అకౌంట్ వివరాలు తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు హ్యాకర్లు. ఎస్‌బీఐ కస్టమర్లకు మెసేజ్‌లల్లో వచ్చే వెబ్‌సైట్స్ చైనాలో రిజిస్టర్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ పరిశోధనలో తేలింది.
    Published by:Santhosh Kumar S
    First published: