SBI Alert: మీ కార్డు మీ దగ్గరే... డబ్బులు నేరగాళ్ల అకౌంట్లోకి... ఇలా జాగ్రత్తపడండి

SBI Alert | మీరు మీ కార్డు ఎక్కడో స్వైప్ చేస్తారు. షాపింగ్ ముగించుకొని వెళ్లిపోతారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు మీ డేటాను క్లోన్ చేసి మరో కార్డు తయారు చేస్తారు. మీరు మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు స్వైప్ చేసినప్పుడు అక్కడ అంతకుముందే ఏర్పాటు చేసిన స్కిమ్మర్‌లోకి మీ డేటా వెళ్తుంది.

news18-telugu
Updated: February 14, 2019, 11:32 AM IST
SBI Alert: మీ కార్డు మీ దగ్గరే... డబ్బులు నేరగాళ్ల అకౌంట్లోకి... ఇలా జాగ్రత్తపడండి
SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి
news18-telugu
Updated: February 14, 2019, 11:32 AM IST
కార్డు మోసాలు ఖాతాదారులకు మాత్రమే కాదు... బ్యాంకులకూ పెద్ద తలనొప్పిగా మారాయి. క్షణాల్లో ఖాతాదారులు వేలాది రూపాయలు నష్టపోతుంటే, ఆ ఫిర్యాదులను పరిష్కరించలేక బ్యాంకులు ముప్పుతిప్పలు పడుతున్నాయి. అయితే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలను అరికట్టొచ్చు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు కొన్ని సూచనలు చేసింది. ఎక్కువగా జరిగే స్కిమ్మింగ్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో వివరిస్తూ కస్టమర్లకు ఇమెయిల్ పంపింది.

Read this: SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే

SBI card frauds, SBI alert, debit card frauds, credit card cheatings, skimming frauds, sbi card safety, sbi atm card, sbi card cloning, atm card cheatings, atm card skimming, ఎస్‌బీఐ కార్డు భద్రత, ఏటీఎం కార్డు క్లోనింగ్, ఏటీఎం కార్డు స్కిమ్మింగ్



స్కిమ్మింగ్ అంటే ఏంటీ? ఎలా చేస్తారు?


సైబర్ నేరాల్లో స్కిమ్మింగ్ మోసాలే ఎక్కువ. మీ దగ్గర ఉన్న కార్డులోని డేటాను మీకు తెలియకుండా కొట్టేసి, ఆ డేటాతో మరో కార్డు తయారు చేయడమే స్కిమ్మింగ్ అండ్ క్లోనింగ్. మీరు మీ కార్డు ఎక్కడో స్వైప్ చేస్తారు. షాపింగ్ ముగించుకొని వెళ్లిపోతారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు మీ డేటాను క్లోన్ చేసి మరో కార్డు తయారు చేస్తారు. మీరు మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు స్వైప్ చేసినప్పుడు అక్కడ అంతకుముందే ఏర్పాటు చేసిన స్కిమ్మర్‌లోకి మీ డేటా వెళ్తుంది. ఆ డేటా ఉంటే మరో కార్డు తయారుచేయడం చాలా సులువు. ఇక మీరు పిన్ ఎంటర్ చేసేప్పుడు రహస్యంగా రికార్డ్ చేస్తారు కాబట్టి నేరగాళ్లకు పిన్ కూడా తెలిసిపోతుంది.



Read this: మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

SBI card frauds, SBI alert, debit card frauds, credit card cheatings, skimming frauds, sbi card safety, sbi atm card, sbi card cloning, atm card cheatings, atm card skimming, ఎస్‌బీఐ కార్డు భద్రత, ఏటీఎం కార్డు క్లోనింగ్, ఏటీఎం కార్డు స్కిమ్మింగ్

Loading...

స్కిమ్మింగ్ మోసాలతో జాగ్రత్త... కస్టమర్లకు ఎస్‌బీఐ జాగ్రత్తలు


క్రెడిట్, డెబిట్ కార్డు స్కిమ్మింగ్ మోసాలు ఎక్కువగా ఏటీఎంలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో జరుగుతుంటాయి.
ఎక్కడైనా మీరు కార్డుతో షాపింగ్ చేసేప్పుడు మీరు మాత్రమే కార్డును స్వైప్ చేయాలి. కంపెనీ ప్రతినిధులకు ఇవ్వొద్దు. మీ పిన్ చెప్పకూడదు.
మీరు పిన్ ఎంటర్ చేసేప్పుడు ఎవరికీ కనిపించకుండా చేతిని అడ్డుగా పెట్టాలి.
ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత కార్డు తీసుకోవడం మర్చిపోకూడదు.
మీ పిన్ ఎవరికీ చెప్పకూడదు.
ఇప్పడు అందరి దగ్గరా చిప్ కార్డులు ఉన్నాయి కాబట్టి... ఇక స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కార్డును పీఓఎస్ మెషీన్‌లో ఇన్సర్ట్ చేస్తే చాలు.
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ముందు స్కిమ్మర్ డివైజ్ ఉంచారేమో ఓసారి పరిశీలించాలి.
ఏటీఎంలో పిన్ ఎంటర్ చేసే కీప్యాడ్‌ను పరిశీలించాలి. అక్కడ మీ పిన్ తెలుసుకునేందుకు డూప్లికేట్ కీ ప్యాడ్ ఏర్పాటు చేస్తారు నేరగాళ్లు.
ఎవరైనా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని పిన్ అడిగితే నమ్మకూడదు.
మీ కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పొద్దు.

Read this: IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

SBI card frauds, SBI alert, debit card frauds, credit card cheatings, skimming frauds, sbi card safety, sbi atm card, sbi card cloning, atm card cheatings, atm card skimming, ఎస్‌బీఐ కార్డు భద్రత, ఏటీఎం కార్డు క్లోనింగ్, ఏటీఎం కార్డు స్కిమ్మింగ్


మోసపోయినా, అనధికార లావాదేవీలు జరిగినా ఇలా ఫిర్యాదు చేయాలి


1. ఎస్‌బీఐ కాల్ సెంటర్... 24 గంటలు పనిచేస్తుంది.
2. ఎస్‌బీఐ ఇమెయిల్ customercare@sbicard.com లేదా www.sbicard.com/email లింక్‌లో కంప్లైంట్ చేయొచ్చు.
3. “Problem” అని టైప్ చేసి 9212500888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపొచ్చు.
4. Twitter@SBICard_Connect ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
5. అన్ని బ్రాంచుల్లోనే కంప్లైంట్ సెల్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
6. పోస్టు లేదా కొరియర్ ద్వారా ఈ కింది అడ్రస్‌కు ఫిర్యాదు పంపొచ్చు.
SBI Cards & Payment Services Pvt. Ltd.
DLF Infinity Towers, Tower C,12th Floor, Block 2, Building 3,
DLF Cyber City, Gurgaon -122002 (Haryana) India
Fax No. 0124-2567131.

మీ పొరపాటు వల్లనో, బ్యాంకు పొరపాటు వల్లో మోసపోతే మూడు రోజుల్లో కంప్లైంట్ చేయడం మంచిది. అప్పుడే మీ డబ్బు తిరిగి రాబట్టుకోవచ్చు.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...


ఇవి కూడా చదవండి:

XIAOMI SHOES: షావోమీ నుంచి 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2'

Xiaomi Discount: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... 3 రోజులు మాత్రమే

Oppo K1: ఇండియాలో లాంఛైన ఒప్పో కే1... స్పెసిఫికేషన్స్ ఇవే
First published: February 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...