SBI Platinum Term Deposits: ఎస్​బీఐ నుంచి ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ ప్లాన్’ లాంచ్​.. ప్రయోజనాల వివరాలివే!

(ప్రతీకాత్మక చిత్రం)

పెట్టుబడి ద్వారా అదనంగా 15 బీపీఎస్​ వరకు వడ్డీ ప్రయోజనాలు పొందవచ్చు” అని తెలిపింది. ఎస్​బీఐ ప్రస్తుతం 75 రోజుల కాలపరిమితి గల డిపాజిట్లపై 3.90% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి ప్లాటినం టర్మ్ డిపాజిట్​ స్కీమ్ కింద పెట్టుబడి పెడితే 4.05% వడ్డీ లభిస్తుంది.

  • Share this:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్‌లను’ ప్రవేశపెట్టింది. ఈ కొత్త టర్మ్ డిపాజిట్ ప్లాన్ కింద.. కస్టమర్ 75 రోజులు, 75 వారాలు, 75 నెలల వ్యవధితో చేసే డిపాజిట్లపై 15 బీపీఎస్​ (0.15%) వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. 2021 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్​ 14 మధ్య ఈ స్కీమ్​లో చేరిన వారికే ఈ ఆఫర్​ వర్తిస్తుందని ఎస్​బీఐ పేర్కొంది.

ఈ సరికొత్త ప్లాటినం టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ గురించి మరిన్ని వివరాలను ఎస్​బీఐ ట్వీట్​ చేసింది. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా రిటైల్ డిపాజిటర్ల కోసం ప్లాటినం టర్మ్ డిపాజిట్ ప్లాన్​ను ప్రారంభించాం. దీనిలో పెట్టుబడి ద్వారా అదనంగా 15 బీపీఎస్​ వరకు వడ్డీ ప్రయోజనాలు పొందవచ్చు” అని తెలిపింది. ఎస్​బీఐ ప్రస్తుతం 75 రోజుల కాలపరిమితి గల డిపాజిట్లపై 3.90% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి ప్లాటినం టర్మ్ డిపాజిట్​ స్కీమ్ కింద పెట్టుబడి పెడితే 4.05% వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 75 వారాల డిపాజిట్లపై 5 శాతం, 75 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.4% వడ్డీ అందజేస్తుంది. ఈ కొత్త స్కీమ్​లో పెట్టుబడి పెట్టడం ద్వారా వరుసగా 5.15%, 5.55% వడ్డీ రేట్లు లభిస్తాయి.

ప్లాటినం టర్మ్ డిపాజిట్లతో ఇతర ప్రయోజనాలు

అన్ని రకాల కారు లోన్లపై 100% ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. కారు మొత్తం ఆన్​రోడ్​ ధరలో 90% వరకు లోన్​ పొందవచ్చు.

యోనో యాప్ ద్వారా కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు 25 బీపీఎస్​ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుంది. తద్వారా, కస్టమర్లు కేవలం 7.5% వడ్డీ రేటుతోనే కారు లోన్ ​పొందవచ్చు.

ప్లాటినం టర్మ్​ డిపాజిట్​లో చేరిన కస్టమర్ల గోల్డ్ లోన్ పై 75 బీపీఎస్ వడ్డీ రేటు​ తగ్గింపు లభిస్తుంది. ఎస్​బీఐ కస్టమర్లు 7.5% వడ్డీ రేటుతో గోల్డ్ లోన్​ పొందవచ్చు. యోనో యాప్​ ద్వారా గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లందరికీ ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

ఎస్​బీఐ పర్సనల్, పెన్షన్ లోన్ వినియోగదారులకు ప్రాసెసింగ్ ఫీజులో 100% మినహాయింపు లభిస్తుంది.

కోవిడ్ కట్టడిలో ముందున్న ఫంట్​ లైన్​ వారియర్స్​కు 50 బిపిఎస్‌ల ప్రత్యేక వడ్డీ రాయితీ లభిస్తుంది.

* ఈ ఆఫర్లపై ఎస్​బీఐ రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్​ ఎండీ సీఎస్​ శెట్టి మాట్లాడుతూ.. “పండుగ సీజన్‌కు ముందు మా కస్టమర్లందరికీ ఆఫర్లను ప్రకటించడం సంతోషంగా ఉంది. కస్టమర్లు తమ రుణాలపై మరింత ఆదా చేయడానికి ఇదే మంచి సమయం. ఈ ఆఫర్లు వారి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయని నమ్ముతున్నాం. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే మా ముందున్న ఏకైక లక్ష్యం" అని చెప్పారు.
Published by:Krishna Adithya
First published: