మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? లావాదేవీల కోసం తరచూ బ్యాంకుకు వెళ్తుంటారా? ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేసుకుంటే మొబైల్ ద్వారానే లావాదేవీలు జరపొచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. గతంలో అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చేది. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్బీఐ వెబ్సైట్లోనే నెట్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ ఉన్నవాళ్లు మాత్రం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యం కాదు. వాళ్లు బ్రాంచ్‌కు వెళ్లాల్సిందే. మిగతావాళ్లు మాత్రం ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్, బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టీవ్‌లో ఉండాలి.
SBI Internet Banking: రిజిస్టర్ చేసుకోండిలా...
ముందుగా
www.onlinesbi.com ఓపెన్ చేయండి.
'New User Activation/Registration' పైన క్లిక్ చేయండి.
మీరు బ్రాంచ్‌లో నెట్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే OK పైన క్లిక్ చేయండి.
'New User Registration' క్లిక్ చేసి 'Next' పైన క్లిక్ చేయాలి.
మీ అకౌంట్ నెంబర్, సీఐఎఫ్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ బ్రాంచ్ కోడ్ లాంటి వివరాలు ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి. ఇవన్నీ బ్యాంక్ పాస్‌బుక్ పైన ఉంటాయి.
నెట్ బ్యాంకింగ్‌లో ఎలాంటి సేవలు కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Confirm పైన క్లిక్ చేయాలి.
'I have my ATM card' సెలెక్ట్ చేసుకొని కార్డు వివరాలు ఎంటర్ చేయాలి.
మీకు తాత్కాలిక యూజర్ నేమ్ వస్తుంది. దాంతో లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత కొత్త యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకోవాలి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ నియమనిబంధనలన్నీ చదివి చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత మీ లాగిన్ పాస్వర్డ్, ప్రొఫైల్ పాస్వర్డ్ వేర్వేరుగా క్రియేట్ చేయాలి.
సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని జవాబు ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఉపయోగపడుతుంది.
మీ పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, దేశం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.
ఇక మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్మీ కే20, కే 20 ప్రో
ఇవి కూడా చదవండి:
SBI: మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? త్వరలో ఐఎంపీఎస్ ఛార్జీలూ ఉండవు
Mobile App: మీరు కొనే వస్తువులు ఒరిజినలా? నకిలీవా? ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు
ICICI: వడ్డీ లేకుండా అప్పు... ఐసీఐసీఐ నుంచి ఆఫర్