దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లు(FD)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్లకు పైనున్న బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. మార్చి 10, 2022 నుంచి ఈ పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి ఉన్న రూ.2 కోట్లకు పైబడిన ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాస్తవంగా ఈ ఎఫ్డీలపై 3.30 శాతం వడ్డీ ఉంది. ఎస్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో 3.10 శాతం నుంచి 3.30 శాతానికి ఈ వడ్డీ పెరగనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది స్టేట్ బ్యాంక్. దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది.
ఈ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచి 5.20 శాతానికి తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్. SBI YONO: ఎస్బీఐ యోనో యాప్ కొత్త అప్టేడ్.. ఇక నుంచి ఆ సేవలు మొత్తం ఈ యాప్ ద్వారానే..
మూడేళ్ల నుంచి ఐదేళ్ల కంటే తక్కువ గడువు ఉన్న డిపాజిట్లకు వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఇలాంటి డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీని పొందవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిగపాజిట్లపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.50 శాతానికి చేరింది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15, 2021 నుంచే అమల్లోకి వచ్చాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.