హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI IMPS: వెంటనే డబ్బులు పంపాలా? ఎస్‌బీఐ ఐఎంపీఎస్ సర్వీస్ వాడుకోండి ఇలా

SBI IMPS: వెంటనే డబ్బులు పంపాలా? ఎస్‌బీఐ ఐఎంపీఎస్ సర్వీస్ వాడుకోండి ఇలా

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

SBI IMPS | మీరు ఎస్‌బీఐ కస్టమరా? మరొకరి అకౌంట్‌లోకి డబ్బులు పంపాలనుకుంటున్నారా? ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా ఎలా డబ్బులు పంపొచ్చో తెలుసుకోండి.

టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వేగం పెరిగిపోయింది. గతంలో ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రెండుమూడు రోజులు పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయొచ్చు. యూపీఐ (UPI) ద్వారా వెంటనే డబ్బులు పంపొచ్చు. అయితే యూపీఐ ద్వారా డబ్బులు పంపాలంటే అవతలివారికి కూడా యూపీఐ ఐడీ ఉండాలి. లేకపోతే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం కాదు. వారికి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు పంపొచ్చు. మరి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఐఎంపీఎస్ సేవల్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Credit Card: ఫ్యూయెల్ ఆఫర్ ఉన్న క్రెడిట్ కార్డు తీసుకున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపండి ఇలా


Step 1- ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో ఇంటర్నెట్

Step 2- బ్యాంకింగ్ వెబ్‌సైట్ www.onlinesbi.com లో లాగిన్ కావాలి.

Step 3- ప్రొఫైల్ సెక్షన్‌లో మేనేజ్ బెనిఫీషియరీ పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత ఐఎంపీఎస్ బెనిఫీషియరీ సెలెక్ట్ చేయాలి.

Step 5- బెనిఫీషియరీ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 6- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

Step 7- పేమెంట్స్ ట్రాన్స్‌ఫర్ పన క్లిక్ చేయాలి.

Step 8- IMPS Funds Transfer పైన క్లిక్ చేసి Fund Transfer ఓపెన్ చేయాలి.

Step 9- బెనిఫీషియరీ పేరు సెలెక్ట్ చేయాలి.

Step 10- ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

Step 11- చివరగా Confirm పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 12- ఓటీపీ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

LIC Policy: ఈ పాలసీలో రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్

ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్‌లో కూడా ఇదే పద్ధతిలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఐఎంపీఎస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. సెలవు రోజుల్లో కూడా ఐఎంపీఎస్ లావాదేవీలు జరపొచ్చు. రూ.2,00,000 లోపు ఛార్జీలు ఉండవు. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపిస్తే వెంటనే అవతలివారి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఒక రోజులో ఒక బెనిఫీషియరీని మాత్రమే యాడ్ చేయొచ్చు. బెనిఫీషియరీని యాడ్ చేసిన నాలుగు గంటల తర్వాత యాక్టివేట్ అవుతుంది. రాత్రి 8 గంటల తర్వాత బెనిఫీషియరీ పేరు యాడ్ చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటల తర్వాతే డబ్బులు పంపొచ్చు. మొదటి నాలుగు రోజులు కేవలం రూ.1,00,000 మాత్రమే పంపొచ్చు. 4 రోజుల తర్వాత రూ.2,00,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

First published:

Tags: IMPS, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు