Bank News | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో నమ్మదగిన, అత్యంత సురక్షితమైన బ్యాంకులు (Banks) ఏంటివో వెల్లడించింది. ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఈ బ్యాంకులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ బ్యాంకులు ఏమైనా అయితే.. ఆ ప్రభావం దేశం పైనే పడుతుందని పరోక్షంగా చెప్పుకోవచ్చు. రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ ఆర్‌బీఐ మోస్ట్ రిలైబుల్ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఆర్‌బీఐ డొమెస్టిక్ సిస్టమ్యాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు జాబితాను పరిశీలిస్తే.. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులను నిశితంగా గమనిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు వస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ గతంలో క్రెడిట్ కార్డుల జారీ నుంచి కొంత కాలం ఆంక్షలు విధించిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డులు.. ఫ్రీగా రూ.5 లక్షల బెనిఫిట్, ఇలా అప్లై చేసుకోండి!
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చూస్తే.. ఈ బ్యాంకులు వాటి రిస్క్ వెయిటెడ్ అసెట్స్‌లో కొంత మొత్తాన్ని టైర్ 1 ఈక్విటీలో ఉంచాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ అయితే తన రిజర్వడ్ అసెట్స్‌లో 0.6 మొత్తాన్ని టైర్ 1 ఈక్విటీలో ఉంచింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి అయితే 0.2 శాతం మొత్తాన్ని టైర్ 1 ఈక్విటీలో ఉంచాయి. ఆర్‌బీఐ 2015 నుంచి వ్యవస్థలో కీలకమైన బ్యాంకులను నిశితంగా గమనిస్తూ వస్తోంది.
కేంద్రం కీలక నిర్ణయం.. 8 లక్షల కుటుంబాలకు ఉచితంగా డిష్ టీవీ!
ఆర్‌బీఐ ప్రతి ఏటా ఆగస్ట్ నెలలో బ్యాంకులను అసెస్‌మెంట్ చేస్తుంది. బ్యాంకుల కార్యకలాపాలు, వాటి విస్తరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దేశంలో ముఖ్యమైన బ్యాంకుల జాబితాను రూపొందిస్తుంది. దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నా కూడా ఈ జాబితాలో కేవలం మూడు బ్యాంకులు మాత్రమే స్థానం సంపాదించుకున్నాయి. 2015లో జాబితాను గమనిస్తే.. అప్పుడు కేవలం రెండు బ్యాంకులు మాత్రేం ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ మాత్రమే స్థానం దక్కించుకున్నాయి. అయితే 2017 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఈ జాబితాలో ఉంటూ వస్తోంది. అంటే ఆర్‌బీఐ జాబితా ప్రకారం చూస్తే.. మన దేశంలో చాలా బ్యాంకులు ఉన్నప్పటికీ ఈ మూడు బ్యాంకులే టాప్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల వీటిల్లో డబ్బులు దాచుకుంటే ఎలాంటి ఢోకా ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, HDFC bank, Icici bank, Rbi, Sbi