Savings Account: సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిస్తున్న బ్యాంకులు

Savings Account: సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిస్తున్న బ్యాంకులు (ప్రతీకాత్మక చిత్రం)

Savings Account Interest Rates | సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి వరుసగా షాకులు ఇస్తున్నాయి బ్యాంకులు. ఇటీవల సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించాయి.

  • Share this:
    మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే సేవింగ్స్ అకౌంట్‌పైన ఇచ్చే వడ్డీ ఎంతో ఓసారి కనుక్కోండి. ఎందుకంటే ఇటీవల బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల రెపో రేట్‌, రివర్స్ రేపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా పలు రకాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అందులో భాగంగా సేవింగ్స్ అకౌంట్‌పైన ఇచ్చే వడ్డీ రేటును కూడా తగ్గిస్తున్నాయి. ఇప్పటివరకు ఏఏ బ్యాంకు వడ్డీ రేటు ఎంత తగ్గించిందో తెలుసుకోండి.

    State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును రెండుసార్లు తగ్గించింది. గతంలో 3 శాతం ఉన్న వడ్డీ రేటును 2.75 శాతానికి తగ్గించిన ఎస్‌బీఐ, జూన్ 2న మరోసారి 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటును తగ్గించి 2.70 శాతం చేసింది. అన్ని కాలవ్యవధులకు ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని ప్రకటించింది. మే 31న ఈ వడ్డీ రేటు అమలులోకి వచ్చేసింది.

    ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. రూ.50 లక్షలలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 3.25 శాతం నుంచి 3 శాతం చేసింది. రూ.50 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటును 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 4 నుంచి అమలులోకి వచ్చాయి.

    Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కూడా జూన్ 1న సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై వడ్డీని 3.5 శాతానికి తగ్గించింది. ఇప్పటికే రూ.50 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లకు 3.5 శాతం వడ్డీ ఇస్తోంది.

    Kotak Mahindra Bank: కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్‌కు 3.50 శాతం, రూ.1 లక్ష కన్నా ఎక్కువ బ్యాలెన్స్‌కు 4 శాతం వడ్డీ ఇస్తోంది. మే 25న కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.

    ఇక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, స్మాల్ అకౌంట్లకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

    ఇవి కూడా చదవండి:

    Jan Dhan Money: నేటి నుంచి జన్ ధన్ ఖాతాలోకి డబ్బులు... ఎవరికి ఎప్పుడంటే

    Current Bill: తెలంగాణలో కరెంట్ బిల్లును ఎలా లెక్కిస్తున్నారో తెలుసా?

    Special Trains: అలర్ట్... ఈ స్టేషన్లలో స్పెషల్ ట్రైన్స్ ఆగవు... ప్రకటించిన రైల్వే
    Published by:Santhosh Kumar S
    First published: