SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రెండు రకాల హోమ్ లోన్స్... వివరాలివే

SBI Home Loan | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ మార్చినప్పుడల్లా హోమ్ లోన్ వడ్డీ రేట్లు మారుతుంటాయి.

news18-telugu
Updated: July 1, 2019, 7:14 PM IST
SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రెండు రకాల హోమ్ లోన్స్... వివరాలివే
SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రెండు రకాల హోమ్ లోన్స్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం. image: SBI)
news18-telugu
Updated: July 1, 2019, 7:14 PM IST
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇంటికి హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు విధానంలో మార్పులొచ్చాయి. జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ గురించి గతంలోనే ప్రకటించింది ఎస్‌బీఐ. 2016 ఆగస్ట్ నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR అమలులో ఉంది. జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ అమలులోకి వచ్చేసింది. ప్రస్తుతం రెపో రేట్ 5.75% ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ మార్చినప్పుడల్లా హోమ్ లోన్ వడ్డీ రేట్లు మారుతుంటాయి. అయితే రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్స్ తీసుకునేవారి వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలని బ్యాంకు పరిమితి విధించింది. అంతేకాదు... ఒకవేళ లోన్ విలువ 80% కన్నా ఎక్కువ ఉంటే వడ్డీ రేటు మరో 20 బీపీఎస్ పెరుగుతుంది.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు రకాల హోమ్ లోన్స్ కస్టమర్లకు లభిస్తాయి. కస్టమర్లు MCLR లింక్డ్ హోమ్ లోన్ లేదా రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ తీసుకోవచ్చు. MCLR ఆప్షన్ ఎంచుకుంటే MCLR రేట్‌ని బట్టి మీ వడ్డీ రేట్ ఉంటుంది. రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ అయితే మీ ఇంటి రుణంపై వడ్డీ రేటు రెపో రేట్‌కు లింకై ఉంటుంది. అలాగని రెపో రేట్ ఎంత ఉంటే అంత శాతానికి హోమ్ లోన్ వస్తుందనుకుంటే పొరపాటే. రెపో రేట్ కన్నా 2.65% లేదా అంతకన్నా ఎక్కువగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించినప్పుడు ఆ లాభం నేరుగా కస్టమర్ల ఖాతాలోకి చేరుతుంది. ఒకవేళ ఆర్‌బీఐ రెపో రేట్ పెంచితే హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా మారుతుంది. ఇక ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించిన తర్వాత ఎస్‌బీఐ కూడా హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే ముందు మీ అవసరాలకు MCLR, రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్స్‌లో ఏది సరైనదో విశ్లేషించుకోవడం మంచిది.

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

IRCTC: హైదరాబాద్‌-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ

Tata Sky: టాటాస్కై సెట్-టాప్ బాక్సుల ధరలు తగ్గాయి
Loading...
Good News: ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేవు... ప్రకటించిన పేటీఎం
First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...