• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • SBI HOME LOAN OFFER STATE BANK OF INDIA OFFERS ZERO PROCESSING FEES ON HOME LOAN AND HOME LOAN TRANSFER OFFER VALID UP TO FEBRUARY 28TH CHECK ALL DETAILS HERE SS

SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఇవాళే చివరి రోజు

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్‌బీఐ రూల్స్ ఇవే

SBI Home loan Offer | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్రాంచులతో పాటు ఆన్‌‌లైన్‌లో హోమ్‌ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనూ మీ వివరాలు నమోదు చేస్తే ఎస్‌బీఐ ఏజెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు.

  • Share this:
    మీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీలాంటి వారికోసం జీరో ప్రాసెసింగ్ ఫీజ్‌తో హోమ్‌ లోన్‌ ఆఫర్ చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సాధారణంగా హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు, టెక్నికల్, లీగల్ ఛార్జీలు ఉంటాయి. ఇవన్నీ కలిపి లోన్ తీసుకున్నవారిపై వడ్డీతో పాటు అదనంగా భారం పడుతుంది. కస్టమర్లపై భారం తగ్గించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజును తొలగించింది. ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతే కాదు ఇటీవల ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గాయి.


    జీరో ప్రాసెసింగ్ ఫీజుతో ఎంత లాభం?


    సాధారణంగా ఎస్‌బీఐ రూ.25 లక్షల లోన్ వరకు 0.25%, కనీసం రూ.1,000, రూ.25 లక్షల నుంచి రూ.75 లక్షల లోన్ తీసుకునే వారికి రూ.6,500, రూ.75 లక్షల కన్నా ఎక్కువ లోన్ తీసుకునేవారికి రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటుంది. ఇప్పుడు ఆఫర్ ఉండటంతో ఈ ప్రాసెసింగ్ ఫీజును తొలగించి కస్టమర్లకు హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. కాబట్టి అంతమేరకు కస్టమర్లకు లాభమే. అయితే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకపోయినా టెక్నికల్, లీగల్ ఛార్జీలు కస్టమర్లు చెల్లించాల్సిందే. ఈ ఛార్జీలను లోన్ తీసుకునే సమయంలో బ్యాంకు సిబ్బంది వివరిస్తారు. ఒకవేళ లోన్ మొత్తం ముందుగానే చెల్లిస్తే ప్రీపేమెంట్ ఛార్జీలు ఉంటాయి. కానీ ఎస్‌బీఐ ప్రస్తుతం ప్రీపేమెంట్ ఛార్జీలను వసూలు చేయట్లేదు.

    Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    SBI Home loan Offer, State Bank of India offers Zero processing fees, SBI home loan interest rate, home loan interest rate sbi, Zero processing fees on sbi home loan, SBI home loan transfer, home loan transfer zero processing fee, zero processing fee home loan, ఎస్‌బీఐ హోమ్ లోన్ జీరో ప్రాసెసింగ్ ఫీజు, ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ హోమ్ లోన్‌ దరఖాస్తు, ఎస్‌బీఐ హోమ్ లోన్ ఆఫర్స్


    ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?


    ఎవరైనా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే లోన్ అమౌంట్, కస్టమర్ వేతనం, ఎలాంటి లోన్ అన్న అంశాలను పరిశీలించి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మహిళలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. రూ.30 లక్షల లోన్ తీసుకుంటే మహిళా ఉద్యోగులకు 8.75% నుంచి 8.85%, నాన్-సాలరీడ్ మహిళలకు 8.90% నుంచి 9%, ఇతర కేటగిరీలకు 8.80% నుంచి 8.90%, నాన్-సాలరీడ్ వారికి 8.95% నుంచి 9.05% మధ్య వడ్డీ రేట్లు ఉంటాయి.

    Read this: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

    SBI Home loan Offer, State Bank of India offers Zero processing fees, SBI home loan interest rate, home loan interest rate sbi, Zero processing fees on sbi home loan, SBI home loan transfer, home loan transfer zero processing fee, zero processing fee home loan, ఎస్‌బీఐ హోమ్ లోన్ జీరో ప్రాసెసింగ్ ఫీజు, ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ హోమ్ లోన్‌ దరఖాస్తు, ఎస్‌బీఐ హోమ్ లోన్ ఆఫర్స్


    ఎస్‌బీఐ హోమ్ లోన్‌కు ఎక్కడ దరఖాస్తు చేయాలి?


    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్రాంచులతో పాటు ఆన్‌‌లైన్‌లో హోమ్‌ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనూ మీ వివరాలు నమోదు చేస్తే ఎస్‌బీఐ ఏజెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కొత్తగా లోన్ తీసుకునేవారు మాత్రమే కాదు... హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా జీరో ప్రాసెసింగ్ ఫీజ్ వర్తిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐలో ఇంటి రుణం తీసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

    ఇవి కూడా చదవండి:

    Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

    Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...

    Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన
    First published: