హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Home Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ బంపరాఫర్.. ఆ చార్జీలు లేకుండానే లోన్!

SBI Home Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ బంపరాఫర్.. ఆ చార్జీలు లేకుండానే లోన్!

SBI Home Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ బంపరాఫర్.. ఆ చార్జీలు లేకుండానే లోన్!

SBI Home Loan: కస్టమర్లకు ఎస్‌బీఐ బంపరాఫర్.. ఆ చార్జీలు లేకుండానే లోన్!

SBI Loan | ఎస్‌బీఐ తీపికబురు అందించింది. ఆ చార్జీలు లేకుండానే రుణాలు అందిస్తోంది. దీంతో లోన్ తీసుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. ఇంకా బ్యాంక్ ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉంచిందో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

SBI Offer | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. లోన్ తీసుకుకోవాలని భావించే వారికి సూపర్ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. దీంతో బ్యాంక్ (Bank) నుంచి రుణం (Loan) పొందే వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఏ రుణాలు ఎలాంటి బెనిఫిట్ కల్పిస్తోందో ఇప్పుడు ఒకసారి మనం తెలుకుందాం.

సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్ అందించింది. ప్రాసెసింగ్ చార్లీలు లేకుండానే హోమ్ లోన్ పొందొచ్చని వెల్లడించింది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో బ్యాంక్ నుంచి హోమ్ లోన్ పొందాలని భావించే వారికి చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎస్‌బీఐ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది.

అలాంటి వారి ఆధార్ కార్డులు వెంటనే రద్దు.. యూఐడీఏఐ కొత్త విధానం?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు హోమ్ లోన్ పొందాలని భావిస్తే.. వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఇంకా ఎక్కువ వడ్డీకీ హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వరుస పెట్టి రుణ రేట్లు పెంచుకుటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే.

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి!

ఇంకా బ్యాంక్ సోలార్ రూఫ్ టాప్ ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది. అలాగే ఎలాంటి హిడెన్ చార్జీలు ఉండవని బ్యాంక్ పేర్కొటోంది. ఎస్‌బీఐ టైఅప్ ప్రాజెక్టులకు అయితే కవేలం 5 రోజుల్లో లోన్ పొందొచ్చని ఎస్‌బీఐ తెలియజేసింది. హోమ్ లోన్ పొందాలని భావించే వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. కాగా రానున్న రోజుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును పెంచొచ్చని తెలుస్తోంది. ఎస్‌బీఐ హోమ్ లోన్ పొందాలని భావించే వారు బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

First published:

Tags: Bank news, Home loans, Sbi, State bank of india