దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) హోమ్ లోన్ వడ్డీ రేట్లు(SBI Home Loans) పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(EBLR) 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇక రెపో రేటు (Repo Rate) లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 6.65 శాతానికి పెరిగింది.
సిబిల్ స్కోర్ కీలకం
సిబిల్ స్కోర్(CIBIL SCORE) సరిగా ఉన్నట్లయితే తక్కువ వడ్డీ రేటుకే ఇంటి రుణం పొందొచ్చని ఎస్బీఐ పేర్కొంది. క్రెడిట్ స్కోర్ ఎంత తక్కువగా ఉంటే, హోమ్ లోన్‌పై వసూలు చేసే వడ్డీ రేటు అంత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
సాధారణంగా రుణ ఆమోదానికి క్రెడిట్ స్కోర్ కీలకం. క్రెడిట్ పరంగా రుణగ్రహీతల గురించి నిర్ధిష్టమైన అవగాహనను ఈ స్కోర్ అందిస్తుంది. ముఖ్యంగా సిబిల్ స్కోర్(CIBIL SCORE) రుణగ్రహీత తన క్రెడిట్‌ని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో తెలియజేస్తుంది. అదే సమయంలో రుణగ్రహీతలు తమ రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా ఇది తెలుపుతుంది.
Interest Rates: రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచిన HDFC.. భారం కానున్న హోమ్ లోన్ ఈఎంఐలు..
- SBI సాధారణ గృహ రుణాలకు 800 కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే వడ్డీ రేటు 7.45 శాతం నుంచి 7.05 శాతం మధ్య ఉంటుంది.
- క్రెడిట్ స్కోర్ 750 నుంచి 799 మధ్య ఉంటే వడ్డీ రేటు 7.15 శాతం, 700- 749 మధ్య ఉంటే 7.25 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
- 650- 699 మధ్య క్రెడిట్ స్కోర్ ఉంటే 7.35 శాతం వడ్డీ రేటు, 550- 649 మధ్య 7.55 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
- NTC/నో సిబిల్ స్కోర్ ఉన్నవారికి 7.25 శాతం వడ్డీ రేటుతో రుణాలను ఎస్బీఐ అందిస్తోంది.
SBI హోమ్ లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే గమనించాల్సిన ఇతర అంశాలు..
- EBR 7.05 శాతానికి అనుగుణంగా మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీని ఎస్బీఐ అందిస్తుంది.
- 80 శాతం కంటే ఎక్కువ, 90 శాతం కంటే తక్కువ లేదా సమానమైన రుణాలకు (రూ.30 లక్షల వరకు) కార్డ్ రేటుకు 10 బేసిస్ పాయింట్ల ప్రీమియం వర్తిస్తుంది.
- రూ.20 లక్షల కంటే తక్కువ, రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రుణాలకు ఓవర్‌డ్రాఫ్ట్ కేటగిరీ కింద టాప్ అప్ లోన్ అనుమతించరు.
- 'రెడీ టు మూవ్-ఇన్' ప్రాపర్టీలకు మాత్రమే గరిష్ఠ లాభం వర్తిస్తుంది.
- SBIలో శాలరీ అకౌంట్ ను కొనసాగిస్తే ప్రివిలేజ్, శౌర్య హోమ్ లోన్, అప్నా ఘర్ హోమ్ లోన్ల కింద 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loans, Repo rate, Sbi, State bank of india