Home /News /business /

SBI HOLI OFFER BUY IRCTC TICKETS VIA SBI YONO AND GET RS 500 CHROMA GIFT VOUCHER SS

SBI Holi Offer: ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేస్తే ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్ ఓచర్

SBI Holi Offer: ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేస్తే ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్ ఓచర్

SBI Holi Offer: ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేస్తే ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్ ఓచర్

SBI Holi Offer | ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. EaseMyTrip ప్లాట్‌పామ్‌పై వన్‌వే ఫ్లైట్ టికెట్ కొంటే రూ.500, రిటర్న్ ఫ్లైట్‌పై రూ.1000 తగ్గింపు కూడా లభిస్తుంది.

    మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీలో ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ స్మార్ట్‌ఫోన్‌లో SBI YONO యాప్ ఉంటే... మీకు రూ.500 గిఫ్ట్ ఓచర్ లభిస్తుంది. మీరు కనీసం రూ.500 విలువైన ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి. మీకు రూ.500 క్రోమా గిఫ్ట్ కార్డ్ లభిస్తుంది. మీరు ఒకవేళ రూ.500 లోపు బుక్ చేస్తే గిఫ్ట్ ఓచర్ లభించదు. మీరు ఈ గిఫ్ట్ ఓచర్‌ను రీడీమ్ చేసుకోవాలంటే క్రోమా స్టోర్‌లో రూ.2,500 కొనుగోలు చేయాలి. అంటే రూ.2,500 కొనుగోలుపై రూ.2,000 చెల్లిస్తే చాలు.


    ఇదొక్కటే కాదు... ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. EaseMyTrip ప్లాట్‌పామ్‌పై వన్‌వే ఫ్లైట్ టికెట్ కొంటే రూ.500, రిటర్న్ ఫ్లైట్‌పై రూ.1000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఆఫర్లతో పాటు కొత్తకొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది ఎస్‌బీఐ యోనో యాప్‌. ఏటీఎం కార్డు లేకపోయినా SBI YONO యాప్ ద్వారా నేరుగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సదుపాయాన్ని ఇటీవలే ప్రకటించింది ఎస్‌బీఐ. SBI YONO యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు.
    Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

    ఇవి కూడా చదవండి:

    IRCTC-Google Pay: ఇక 'గూగుల్ పే' యాప్‌లోనే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్

    Redmi Go: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... 'రెడ్‌మీ గో' ధర రూ.4,499 మాత్రమే

    WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
    First published:

    Tags: Indian Railways, Irctc, Sbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు